Rajamouli – David Warner : కర్మ అంటున్న జక్కన్న…
దర్శక ధీరుడు రాజమౌళి ని ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాములుగా హింసించడంలేదు. చాలా దారుణంగా హింసిస్తున్నాడు. రాజమౌళి ఏంటి! వార్నర్ ఏంటి!

The famous cricketer David Warner did not torture director hero Rajamouli as usual.
దర్శక ధీరుడు రాజమౌళి ని ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాములుగా హింసించడంలేదు. చాలా దారుణంగా హింసిస్తున్నాడు. రాజమౌళి ఏంటి! వార్నర్ ఏంటి! ఏమైనా సంబంధం ఉందా అని అనుకోకండి. నేను చెప్పేది నూటికి నూరుపాళ్ళు నిజం.పైగా నా యాక్టింగ్ కి ఆస్కార్ గ్యారంటీ, స్టేజ్ మీద కలుద్దాం అని జక్కన్న కి వార్నర్ సవాలు కూడా విసురుతున్నాడు. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అసలు విషయం చూద్దాం…
రీసెంట్ గా జక్కన్న, వార్నర్ లు కలిసి ఒక యాడ్ షూటింగ్ చేసారు. క్రెడ్ యాప్ కోసం చేసిన ఆ యాడ్ ఇప్పుడు అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. విపరీతంగా నవ్వుకునేలా కూడా చేస్తుంది. నీ మ్యాచ్ టికెట్ల మీద డిస్కౌంట్ ఏమైనా ఉందా అని వార్నర్ ని జక్కన్న అడుగుతాడు. క్రెడ్ యాప్ ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుందని రిప్లై ఇస్తాడు. ఒక వేళ లేకపోతే ఏం చెయ్యాలని జక్కన్న అడుగుతాడు. డిస్కౌంట్ కోసం నువ్వు నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాల్సి ఉంటుందని అంటాడు. దీంతో జక్కన్న డ్రీమ్స్‌లోకి వెళ్తాడు.
వార్నర్‌తో సినిమా తీస్తున్నట్టుగా ఉహించుకుంటాడు. ఒక్కో షాట్ కి, ఒక్కో ఎమోషన్ కి, ఒక్కో స్టెప్ కి వార్నర్ తనదైన స్టైల్లో చేస్తుంటే రాజమౌళి ఇదేం కర్మరా బాబు అంటూ తలపట్టేసుకుంటాడు. పైగా తన యాక్టింగ్‌కు ఆస్కార్ వస్తుందని ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామని వార్నర్ అంటాడు. దాంతో ఆ హింసని భరించలేని జక్కన్న క్రెడ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని పేమెంట్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఈ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. డేవిడ్ వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటున్నారా యాక్టర్ అంటూ వార్నర్ తన ఇన్ స్టాలో యాడ్ ని పోస్ట్ కూడా చేశాడు.