Kamal : కమల్ హాసన్ విశ్వరూపం చూపించాడు
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు చిత్రం 1996 లో విడుదలై సంచలన విజయం సాధించింది. 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు-2వస్తోంది.

The film Bhartiyadudu directed by Shankar starring Kamal Haasan was released in 1996 and became a sensational success.
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు చిత్రం 1996 లో విడుదలై సంచలన విజయం సాధించింది. 28 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు-2వస్తోంది. జులై లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
తాజాగా విడుదలైన ‘ఇండియన్-2’ ట్రైలర్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంది. సిస్టమ్ సరిగా లేదు అంటున్నాం కానీ దానిని సరి చేయడానికి మనం కొంచెం కూడా ప్రయత్నించడం లేదు అంటూ సిద్ధార్థ్ తన స్నేహితులతో చెప్పే సంభాషణలతో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక సేనాపతిగా కమల్ హాసన్ ను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. భారతీయుడు మళ్ళీ రావాలి అంటూ ప్రజల కోరిక మేరకు సేనాపతి తిరిగొస్తాడు. అసలు సేనాపతి ఇన్నేళ్లు ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? తిరిగొచ్చాక ఏం జరిగింది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ట్రైలర్ లో కమల్ గెటప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఇండియన్-2’లో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె. సూర్య, బాబీ సింహ, ప్రియా భవాని శంకర్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం ఉంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.