5 వేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో పాన్ వరల్డ్ ని షేక్ చేయబోయే సినిమా

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ పట్టాలెక్కినప్పటి నుంచి, ప్రెస్ మీట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అంతా వేయిటింగ్. మీడియాని పిలవకుండానే సినిమాను లాంచ్ చేసి, 3 షెడ్యూల్స్ పూర్తి చేశాడు జక్కన్న.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2025 | 02:48 PMLast Updated on: Apr 12, 2025 | 2:48 PM

The Film That Will Shake The Pan World With A Pre Release Business Of 5 Thousand Crores

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ పట్టాలెక్కినప్పటి నుంచి, ప్రెస్ మీట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అంతా వేయిటింగ్. మీడియాని పిలవకుండానే సినిమాను లాంచ్ చేసి, 3 షెడ్యూల్స్ పూర్తి చేశాడు జక్కన్న. ఎంత రహస్యంగా సినిమాని ఉంచాలనుకున్నా, ముందు మహేశ్ లుక్ లీకైంది. తర్వాత షూటింగ్ సీన్ లీకైంది.. ఇప్పుడు పాస్ పోర్ట్ తో మహేశ్ వెకేషన్ కి వెళితే, రాజమౌళి సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఐతే ఫైనల్ గా ప్రెస్ మీట్ పెట్టి టైటిల్ ని, బేసిక్ స్టోరీని చెబితే తప్ప ఎస్ ఎస్ ఎంబీ 29 మూవీ మీద, ఈ అనవసరపు రాద్దాంతం ఆగదు.. అందుకే వరల్డ్ మీడియాని పిలిపించి, ఈనెల 21న అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ సాక్షిగా భారీ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అంతవరకు బానే ఉంది కాని, ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లిన రాజమౌళి, ఈసారి అంతకుమించి ఏం చేస్తాడనే ప్రశ్నకి ఆన్సర్ దొరకబోతోందా? సినిమా రిలీజయ్యాక రిజల్ట్ బట్టీ ఎవరైనా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు.. కాని ప్రెస్ మీట్ తోనే ప్రపంచానికి ఇండియన్ సినిమాని సరికొత్తగా పరిచయం చేయబోతున్నారా? ఇండియన్ సినిమాని రాజమౌళి నెక్ట్స్ లెవల్ కి ఎలా తీసుకెళ్లబోతున్నాడు..?

రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజమౌలి బాహుబలి తీశాడు. సౌత్ నార్త్ మధ్య గోడల్ని కూల్చేశాడు. బాహుబలి 2 తో 1850 కోట్ల వసూల్లని ఇండియన్ సినిమాకు పరిచయం చేశాడు. రష్యా, జర్మనీ, జపాన్ లో కూడా మన తెలుగు సినిమా వెలిగేలా హిస్టరీ క్రియేట్ చేశాడు. తర్వాత త్రిబుల్ ఆర్ తో తెలుగు సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకునేలా చేశాడు. హాలీవుడ్ నటులు, దర్శకులు, మన సినిమాకు ఫిదా అయ్యేలా చేశాడు. అమెరికన్లు, యూరోపీయన్లు థియేటర్స్ లో మన పాటలకు డాన్స్ చేసేలా చేశాడు. ఇప్పడు మహేశ్ బాబుతో నెక్ట్స్ లెవల్ సినిమా తీస్తున్నాడు.

కాబట్టే చాలా జాగ్రత్తగా మూడో కంటికి తెలియకుండా సినిమాను లాంచ్ చేశాడు. అదేమైనెస్ అయ్యింది. ఎంత దాస్తే అంత రోడ్డెక్కినట్టు, ముందు మహేశ్ బాబు లుక్కు, తర్వాత సెట్ల విజువల్స్ బయటికొచ్చాయి. తర్వాత ఏకంగా షూటింగ్ జరిగిన సీనే లీకైంది. సూపర్ స్టార్ మహేశ్ కూడా పాస్ పోర్ట్ తీసుకుని ఫారిన్ టూర్ కి వెళ్లిన విజువల్ వైరలైంది.

అందుకే ఈ లీకులకు బ్రేకులేసేందుకే 21న వరల్డ్ మీడియా ముందు టైటిల్ ని, కాన్సెప్ట్ ని, టోటల్ స్టార్ కాస్ట్ ని రివీల్ చేయబోతున్నాడు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఎన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతోందో కూడా ఎనౌన్స్ చేయబోతున్నాడు. దానికోసమే అంతా వేయిటింగ్. మొత్తంగా ఇండియన్ సినిమా స్టార్స్ అండ్, టెక్నీషియన్స్ అంతా రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెలుతుందనే ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వ మూవీ ఏడు ఖండాల్లో, ఏడు వింతల దగ్గర షూటింగ్ జరుపుకోబోతోంది.

ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న మొదటి సినమా మాత్రమే కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1750 ఐమ్యాక్స్ థియేటర్స్ లో, 1500 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇక నార్మల్ థియేటర్స్ విషయానికొస్తే, ఏకంగా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. అంతేకాకుండా 4 గంటల డ్యూరేషన్ లోసింగిల్ సినిమాగా రాబోతున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 వ మూవీ,ని హాలీవుడ్ దిగ్గజ బ్యానర్లైన వాల్ట్ డిస్నీప్, డ్రీమ్ వర్క్స్ స్టూడియోస్ యూఎస్, యూరప్ లో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి.

ఇక అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ ఈ సినిమాను కెనడాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు. ఆరీజన్ తోపాటు రాజమౌళి రిక్వెస్ట్ వల్ల, 21న జరిగే ప్రెస్ మీట్ కి రాబోతున్నాడు. మొత్తంగా రిలీజ్ కి ముందే టెక్నికల్ గా, ప్రమోషన్ పరగంగా వరల్డ్ వైడ్ గా ట్రెండ్ సెట్ చేయబోతున్న ఈసినిమా, ప్రీరీలజ్ బిజినెస్ కూడా 5 వేల కోట్లనేసరికి పెట్టుబడి 1000 కోట్లుకు నాలుగు రెట్ల లాభం ముందే కన్ఫామ్ అయ్యింది. ఇది కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లో ఒకరోజు ఆడితే 2500 నుంచి 10 వేల కోట్ల వరకు వసూళ్లు రావచ్చు.. అదే జరిగితే హాలీవుడ్ సినిమాల రికార్డుల్నే బ్రేక్ చేసేఛాన్స్ఉంది… ఇందులో సగం రికార్డులు క్రియేట్ అయినా, రాజమౌళి మన ఇండియన్ సినిమాను వరల్డ్ ప్లాట్ ఫాం మీద నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లినట్టే.