Allu Arjun: పుష్ప2 నుంచి షెకావత్ లుక్ రిలీజ్.. ఇలా ఉన్నాడేంట్రా నాయనా..
పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చేసిన భన్వర్ సింగ్ షెకావత్ పుట్టిన రోజు సందర్భంగా ఫహాద్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్.

The film unit has released the first look poster of Fahad as the villain in Pushpa directed by Sukumar on the occasion of his birthday
పుష్ప ది రూల్ గురించి.. దేశమంతా ఎదురుచూస్తోంది ఇప్పుడు ! పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్లైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా కోసం బన్నీ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సరికొత్తగా డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. పుష్ప అంటూ ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్ అంటూ చెప్పిన డైలాగులు ప్యాన్ ఇండియా లెవల్లో పేలాయి. పుష్పతో అల్లు అర్జున్ క్యారెక్టర్‌కు ఎంత పేరు వచ్చిందో.. అందులో విలన్ భన్వర్ సింగ్ షెకావత్‌గా నటించిన నటుడు ఫహద్ ఫాసిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్టీ లేదా పుష్ప అంటూ విలనిజాన్ని ఫాఫ్ అద్భుతంగా పండించాడు.
ఫహాద్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు. భన్వర్ సింగ్ షెకావత్ సర్.. ప్రతీకారంతో వస్తున్నాడు అంటూ ఆ ఫొటో కింద క్యాప్షన్ పెట్టింది మూవీ టీమ్. దీంతో నిన్నటిదాకా అప్‌డేట్ లేదా పుష్ప అంటూ అడిగిన అభిమానులు.. ఇప్పుడు పార్టీ లేదా షెకావత్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పుష్ప 2 ది రూల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలి భాగానికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ మరోసారి మ్యాజిక్ చేయనున్నాడు. ఇప్పుడు షూటింగ్ చివరి దశలో ఉన్న పుష్ప రెండవ భాగంలో ఫహద్ అద్భుతమైన నటనతో ఆకట్టుకునేలా ఈ పాత్రను డిజైన్ చేశారు.