తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ టార్గెట్ 400 కోట్లు.. ఇదో రికార్డ్..

ఆదిపురుష్ మూవీ ఈ శుక్రవారం రాబోతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 350 నుంచి 400కోట్ల వసూల్లు వస్తాయనే అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే థియేటర్ల సంఖ్య, టిక్కెట్ల రేట్లు ఉన్నాయి. వాటి లెక్కలతోనే 15 రోజుల్లో కేవలం తెలంగాణ, ఆంధ్రాలో 350 నుంచి 400 కోట్లు రావొచ్చని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 13, 2023 | 06:36 PMLast Updated on: Jun 13, 2023 | 6:36 PM

The Film Unit Has Set Huge Expectations On Aadipurush Movie And It Will Surpass The Collections Of Baahubali 2 And Come Close To The Collections Of Danga

ఇక ఆదిపురుష్ టీం యూఎస్ లో తప్ప మరెక్కడ ప్రమోషన్ చేయట్లేదనుకుంటున్నారుకాని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్ల వ్యవస్తతో టీ సీరీస్ టీం గట్టి ప్లానింగే చేసింది. ఆ వివరాల ప్రకారం ఆదిపురుష్, తమిళ నాడు నుంచి 100 కోట్లు, కేరళా నుంచి 50, కర్ణాటక నుంచి 90 కోట్లు కలెక్ట్ అయ్యలా థియేటర్స్ ని ఫాలో అప్ చేస్తోంది.

ఇక నార్త్ ఇండియాలోనే 550 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయనే అంచనాలున్నాయి. అలా ఇండియాలో 11 వందలకోట్లు వచ్చేలా ఉంది. ఇక యూఎస్ మార్కెట్ తోపాటు యూకే, ఆస్ట్రేలియా ఇలా విదేశాల్లో 400 కోట్లు కలెక్ట్ చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలిపి 2000 కోట్లని టార్గెట్ చేసింది ఆదిపురుష్ టీం. ఇదే జరిగితే బాహుబలి 2 రికార్డు బద్దలై, దంగల్ రికార్డుని రీచ్ అవుతుంది ఈ సినిమా.