Bhola Shankar: ఇక్కడ పోయింది చాలదా..?
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా భోళా శంకర్. తెలుగులో ఆగస్ట్ 11న విడుదలైన సంగతి తెలిసిందే. హిందీలో కూడా విడుదలకు సిద్దంగా ఉంది.

The film unit is all set to release Chiranjeevi starrer Bhola Shankar in Hindi version
భోళా శంకర్ ఈనెల 25 న వరల్డ్ వైడ్ గా హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. హిందీ టీజర్ కూడా వచ్చింది. అసలే తెలుగులో ఈ సినిమా వచ్చి డిజాస్టరవటంతో తలపట్టుకున్నాడు చిరు. ఇలాంటి టైంలో మన పరువు నార్త్ లో కూడా పోవాలా అనేంతగా, హిందీ వర్షన్ రిలీజ్ మీద కామంట్ల దాడి పెరిగింది.
భోళా శంకర్ ఏరేంజ్ లో ప్లాప్ అయ్యిందంటే, నేనింతే మూవీలో సినిమా రిలీజై ప్లాప్ అయ్యాక డైరెక్టర్ కనిపిస్తే కొడతామనే సీన్ ఉంటుంది.. అచ్చంగా మెగా ఫ్యాన్సే కాదు మామూలుమూవీ లవర్స్ కూడా దర్శకుడు మెహర్ రమేష్ కనిపిస్తే కొట్టేలా ఉన్నాడు. ఏదో వరుసకు తమ్ముడవుతాడని, షాడో ఫ్లాప్ తర్వాత పదేళ్లు కాళీగా ఉన్నాడని జాలి పడి ఛాన్స్ ఇస్తే.. మోహర్ రమేష్ చిరుని నిలువునా ముంచేశాడు.
ఇప్పుడు కనిపించకుండా ఇంట్లో దాక్కుంటున్నాడని అంటున్నారు. ఇది చాలదని ఇప్పడు భోళా శంకర్ హిందీ రిలీజ్ కి ప్లాన్ చేశాడు. నిజానికి భోళా శంకర్ రిలీజ్ రోజే హిందీ వర్షన్ విడుదల కావాలి. కాని డబ్బింగ్ వర్క్ తో పాటు కొన్ని పనులు పూర్తికాక డిలే అయ్యిందట. ఫైనల్ గా 25 న విడుదల చేయాలనుకున్నారు. అది కూడా భోళా శంకర్ రిలీజ్ కి ముందనుకున్న మాట. కాని ఏమైంది భోళా శంకర్ తెలుగు వర్షన్ డిజాస్టర్ అని తేలింది. ఇలాంటి మూవీని హిందీలో రిలీజ్ చేసి అక్కడా మాటలు అనిపించుకోవటం అవసరమా అంటే, ఇది కూడా మోహర్ ప్లానే అని ప్రచారం జరుగుతోంది. హిందీ లో హిట్ అయితే తన మేకింగ్ కరెక్ట్ అని, తెలుగులో ఆడియన్సే రాంగ్ అని నిరూపించాలనేది మోహర్ రమేష్ అద్భుతమైన ఆలోచనట. ఇదే కనుక నిజమైతే, ఆ బ్రేయిన్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చినా తప్పులేదనుకోవాల్సిందే.