టాలీవుడ్ నాలుగు పిల్లర్లు… అల్లు అర్జున్ ను వదిలేశాయా…?

సినిమా పరిశ్రమ అనేది ఒక పజిల్ లాంటిది. అది ఎవరికీ అంత ఈజీగా అర్థం కాదు. అసలు సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో... ఏ కాంపౌండ్ లో వాతావరణం ఎలా ఉందో ఎవరు ఊహించలేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 01:05 PMLast Updated on: Dec 26, 2024 | 1:05 PM

The Four Pillars Of Tollywood Have They Left Allu Arjun

సినిమా పరిశ్రమ అనేది ఒక పజిల్ లాంటిది. అది ఎవరికీ అంత ఈజీగా అర్థం కాదు. అసలు సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుందో… ఏ కాంపౌండ్ లో వాతావరణం ఎలా ఉందో ఎవరు ఊహించలేరు. మొన్నటి వరకు కలిసి ఉన్నారు అనుకున్న మెగా ఫ్యామిలీ విడిపోయింది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చేసాడు. ఇక నందమూరి కుటుంబంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సొంతగా ఎదిగే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నాడు. ప్రస్తుతానికి దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కలిసి ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు తమ సినిమాలు తాను చేసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసే విషయంలో వీళ్ళు ఎవరు కూడా ముందుకు రాకపోవడం చాలామందిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం నాలుగు స్తంభాలుగా చెప్తున్న నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి… అల్లు అర్జున్ కు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎలాగో అల్లు అర్జున్ పై కోపంగా ఉన్నారు.

కాబట్టి మౌనంగా ఉన్నారు. మరి అల్లు అర్జున్ తో అలాగే అల్లు ఫ్యామిలీతో నందమూరి బాలకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా సరే బాలకృష్ణ ఈ వ్యవహారంలో అసలు ఎక్కడా కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దగ్గుబాటి ఫ్యామిలీతో కూడా అల్లు అరవింద్ కు మంచి సంబంధాలు ఉన్నా సరే ఎక్కడ వాళ్లు కూడా నోరు మెదపడం లేదు. అక్కినేని నాగార్జున అయినా సరే మాట్లాడతారని ఆసుపత్రికి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారిని పరామర్శిస్తారని చాలామంది ఎదురు చూశారు. కానీ అది కూడా జరగలేదు.

ఇక ప్రభాస్ మహేష్ బాబు ఎక్కడున్నారో.. ఎవరికి తెలియదు. ప్రభాస్ హైదరాబాదులోనే ఉన్నాడు అనేది క్లారిటీ ఉంది. కానీ అసలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు. కనీసం అల్లు అర్జున్ తో ఫోన్లో మాట్లాడినట్లు కూడా ఎక్కడా వార్తలు బయటకు రాలేదు. కనీసం వీళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన పరిస్థితి కూడా లేదు. దీనిపై ఆడియన్స్ కు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. సినిమా పరిశ్రమ మొత్తం కలిసి ఉంటుంది అని చాలామంది ఇప్పటి వరకు భావించారు. కానీ సినిమా పరిశ్రమంలో ఇన్ని లోసుగులు ఉంటాయని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా.

అయితే ప్రభుత్వానికి భయపడి ఎవరూ జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదనేది కొంతమంది భావన. ఇక నందమూరి బాలకృష్ణ… అల్లు అర్జున్ ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడుతున్నారని వార్తలు వచ్చినా ఎక్కడ కూడా అది అధికారికంగా కనబడలేదు. మరి టాలీవుడ్ లో అత్యంత బలమైన కుటుంబాలుగా ఉన్న దగ్గుబాటి, అక్కినేని, నందమూరి, మెగా కుటుంబాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయనేది ఎవరికి క్లారిటీ లేదు.

మరి అల్లు అర్జున్ అంటే వాళ్లకు పొసగడం లేదా? లేదంటే అల్లు అర్జున్ ఆటిట్యూడ్ నచ్చక వాళ్ళ దూరంగా ఉన్నారా అనేది అర్థం కాని పరిస్థితి. ఒక్క దగ్గుబాటి కుటుంబం మాత్రమే అల్లు అర్జున్ అరెస్టు అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించింది. కానీ ఆసుపత్రికి మాత్రం వెళ్ళలేదు. ఇక నందమూరి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడారు అని అన్నారు కానీ మాట్లాడారా లేదా మాత్రం క్లారిటీ లేదు. కానీ వీళ్ళు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం గమనార్హం.