గేమ్ చేంజర్ అసలు హీరో గ్లోబల్ స్టార్ కాదు… దీనెమ్మ అదే జరిగి ఉంటే బాక్సాఫీస్ లెక్క వేరు

ఇండియా వైడ్ గా ఇప్పుడు గేమ్ చేంజర్ హవా వేరే లెవెల్ లో ఉంది. బాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు ఈ సినిమాపై కాస్త ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలుగు సినిమాలతో బాలీవుడ్కు చెమటలు పడుతుంటే వరుస పెట్టి పానీ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తూ గుక్క తిప్పుకోనీయటం లేదు మన హీరోలు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2025 | 07:39 PMLast Updated on: Jan 04, 2025 | 7:39 PM

The Game Changer Is Not The Real Hero The Global Star

ఇండియా వైడ్ గా ఇప్పుడు గేమ్ చేంజర్ హవా వేరే లెవెల్ లో ఉంది. బాలీవుడ్ జనాలు కూడా ఇప్పుడు ఈ సినిమాపై కాస్త ఫోకస్ పెట్టారు. ఇప్పటికే తెలుగు సినిమాలతో బాలీవుడ్కు చెమటలు పడుతుంటే వరుస పెట్టి పానీ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తూ గుక్క తిప్పుకోనీయటం లేదు మన హీరోలు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో యుద్ధానికి దిగాడు రామ్ చరణ్.

మూడేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే రీసెంట్ గా కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతున్నారు. మెగా ఫాన్స్ కు సంక్రాంతి గిఫ్ట్ ఓ రేంజ్ లో ఇచ్చేందుకు పక్కాగా ప్లాన్ చేశాడు దిల్ రాజు. ప్రమోషనల్ ఈవెంట్స్ తో ఇప్పుడు బాలీవుడ్ ను కూడా షేక్ చేయాలని ఏకంగా అమెరికాలోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు. ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు రాజమండ్రిలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ఒక న్యూస్ మాత్రం మెగా ఫాన్స్ లో హీట్ పెంచింది.

అసలు గేమ్ చేంజెర్ సినిమాలో ఫస్ట్ హీరో రామ్ చరణ్ కాదట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఈ కథ రాసుకున్నాడు శంకర్. కానీ పవన్ కళ్యాణ్ కు డేట్స్ ఇవ్వడం కుదరకపోవడం అలాగే రాజకీయాల్లో బిజీ కావడంతో అదే స్టోరీని రామ్ చరణ్ కు వినిపించాడు. కథలో మేటర్ ఉండడంతో వెంటనే ఓకే చేసిన రామ్ చరణ్ షూటింగ్ కూడా ఎక్కడా లేట్ చేయలేదు. ఈ సినిమా మొదలుపెట్టిన టైం లో ఆచార్య సినిమా ఉండటంతో కాస్త అప్పుడు లేట్ అయింది.

లేదంటే సినిమాను ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉందట. ఇదే కథను ముందు ప్రభాస్ అలాగే మహేష్ బాబుతో కూడా చేద్దామని ప్లాన్ చేశాడు. కానీ వాళ్లకు కథ సూట్ కాకపోవడంతో ఆ ప్లాన్ డ్రాప్ అయ్యాడు. వీళ్ళకంటే ముందు తెలుగులో కంటే తమిళంలో చేద్దామనుకుని వెయిట్ చేసిన అది సాధ్యం కాలేదు. అని అనుకుంటే 2019లోనే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేసుకోవాలని శంకర్ వర్కౌట్ చేశాడు. ఇక ఈ కథను చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా వినడంతో వెంటనే రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టేసాడు శంకర్. చిరంజీవి కొన్ని కొన్ని మార్పులు చెప్పడంతో ఆ మార్పులను చేసి కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి పట్టాలెక్కిచ్చాడు. అసలు ఈ సినిమా కోసం ముందు జాన్వి కపూర్ అని కూడా అనుకున్నాడట శంకర్. కానీ కథలో ఆమె సెట్ కాకపోవడంతో కీయారా అద్వానీని ఫైనల్ చేశారు. ముగ్గురు హీరోయిన్లతో ముందు సినిమాను ప్లాన్ చేసిన కొన్ని కారణాలతో ఇద్దరు హీరోయిన్లను మాత్రమే తీసుకున్నారు.