Ram Charan : గేమ్ ఛేంజర్ నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే
రామ్ చరణ్ (Ram Charan) స్పీడ్‌కి గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ప్లేస్‌లో రెండు మూడు సినిమాలు కంప్లీట్ అయ్యేవి. కానీ శంకర్ ప్రాజెక్ట్ అవడంతో.. ఇరుక్కుపోయాడు చరణ్.

The game changer next schedule is right there
రామ్ చరణ్ (Ram Charan) స్పీడ్‌కి గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ప్లేస్‌లో రెండు మూడు సినిమాలు కంప్లీట్ అయ్యేవి. కానీ శంకర్ ప్రాజెక్ట్ అవడంతో.. ఇరుక్కుపోయాడు చరణ్. దిల్ రాజు (Dil Raju) కూడా శంకర్‌ను ఏమి అనలేని పరిస్థితి. దీంతో.. శంకర్ (Shankar) ఎప్పుడు షూటింగ్ పెట్టుకుంటే, అప్పుడే అన్నట్టుగా గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతు వస్తోంది. కానీ ఇప్పుడు చరణ్ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటికే చరణ్ కోసం బుచ్చిబాబు (Buchi Babu) అంతా రెడీ చేసుకొని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు.
గేమ్ చేంజర్ (Game Changer) షూటింగ్ అవడమే లేట్.. ఆర్సీ 16 (RC 16) సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌లో జరుగుతున్నట్టుగా ఉంది. లేటెస్ట్‌గా చెన్నైలో రెండు రోజుల పాటు షూటింగ్ చేసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు చరణ్. అందుకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెక్స్ట్ గేమ్ చేంజర్ షెడ్యూల్‌ను రాజమండ్రిలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. మే 5 లేదా 6 నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం.
ఈ షెడ్యూల్ నాలుగైదు రోజుల పాట జరగనుందనుందట. అయితే.. గతంలోనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక లాంగ్ షెడ్యూల్స్ తెరకెక్కించాడు శంకర్. ఇక ఇప్పుడు మళ్లీ అక్కడే షూటింగ్ అంటున్నారు. ఇకపోతే.. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి మరో కీలక పాత్రలో నటిస్తోంది. చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.