Game Changer : చివరికి వెళ్లిన ‘గేమ్ చేంజర్’

ఈ మధ్య కాలంలో గేమ్ చేంజర్ (Game Changer) రిలీజ్‌ డేట్ పై జరుగుతున్నంత రచ్చ మరో సినిమా పై జరగలేదనే చెప్పాలి. ఇప్పుడే కాదు.. ఆర్సీ 15 అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి.. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తునే ఉన్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు అటు శంకర్ గానీ, ఇటు దిల్ రాజు గానీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు కదా.. కనీసం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా చెక్ పెట్టడం లేదు. ఫలానా రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని ప్రచారం జరుగుతునే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 11:03 AMLast Updated on: Feb 29, 2024 | 11:03 AM

The Game Changer That Finally Went

ఈ మధ్య కాలంలో గేమ్ చేంజర్ (Game Changer) రిలీజ్‌ డేట్ పై జరుగుతున్నంత రచ్చ మరో సినిమా పై జరగలేదనే చెప్పాలి. ఇప్పుడే కాదు.. ఆర్సీ 15 అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి.. రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తునే ఉన్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు అటు శంకర్ గానీ, ఇటు దిల్ రాజు గానీ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు కదా.. కనీసం సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా చెక్ పెట్టడం లేదు. ఫలానా రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని ప్రచారం జరుగుతునే ఉంది.

నిన్న మొన్నటి వరకు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రిలీజ్ అవడం పక్కా అని వినిపించగా.. ఇప్పుడు ఈ ఏడాది చివరికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. దసరా సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటే.. ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లిందని అంటున్నారు. సలార్ స్ట్రాటజీని ఫాలో అవుతూ.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గేమ్ చేంజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 27న ఓజి, దసరాకు దేవర రిలీజ్ అవుతుండడంతో.. ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదని భావిస్తున్నారట మేకర్స్.

పోనీ 2025 సంక్రాంతికి వద్దామనుకుంటే.. మెగాస్టార్ ‘విశ్వంభర’ వస్తోంది. కాబట్టి.. డిసెంబర్‌లోనే గేమ్ చేంజర్‌ రానుందని టాక్. ఇప్పటికే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చేసిందట. అయితే.. ఇదే డేట్‌కు గేమ్ చేంజర్ రిలీజ్ అయితే మంచి లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. బుధవారం క్రిస్మస్.. ఆ తర్వాత వీకెండ్, న్యూ ఇయర్.. హాలీడేస్ కలిసి రానున్నాయి. ఏదేమైనా.. ఇదే నిజమైతే మాత్రం గేమ్ చేంజర్ కోసం మరో పది నెలలు వెయిట్ చేయాల్సిందే.