Smoking Add: ఈ స్మోకింగ్ యాడ్ పాప ఇప్పుడు హీరోయిన్
సినిమా హాల్లో పొగతాగడం నిషేధం అంటూ వచ్చే ప్రకటనలో చిన్నపాప కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు హీరోయిన్ గా మారబోతుంది.

The girl who appears in the smoking ad in the movie theater is going to be seen as the heroine
సినిమా ఏదైనా ఈ పాప మాత్రం ఉండాల్సిందే. సినిమాలో యాక్టర్‌గా కాదు. సినిమా ముందు వచ్చే స్మోకింగ్ యాడ్‌లో. ప్రతీ సినిమాకు ముందు ఈ యాడ్ ఖచ్చితంగా వస్తుంది. అందుకే సినిమాలోని యాక్టర్స్ ముఖాల కంటే ఈ పాప ముఖం అందరికీ నోట్ అవుతుంది. కానీ అదే పాపను ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు. అంతలా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ బిజీ ఐపోయింది. 1997లో ముంబైలో పుట్టింది సిమ్రాన్. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు మనం రెగ్యులర్‌గా చూస్తున్న సిగరెట్ యాడ్‌లో నటించింది. ఆ యాడ్ తరువాత దాదాపు 150 యాడ్స్ చేసిందట సిమ్రాన్.
2009లో మొదటిసారిగా “బంధన్ సౌత్ జన్మో కా” అనే సీరియల్‌తో బుల్లితెర అరంగేట్రం చేసింది. ఆ తరువాత కొన్ని హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేసింది. క్రిష్-3, లవ్ యూ జిందగీ లాంటి ఫేమస్ సినిమాలు కూడా చేసింది. తెలుగులో ఎంతో పాపులర్ అయిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌లో కూడా నటించింది సిమ్రాన్. ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇచ్చేదుకు ప్రయత్నాలు చేస్తోందట. కొన్ని సినిమాలకు ఆడిషన్స్ కూడా ఇచ్చిందట. త్వరలోనే తెలుగు స్క్రీన్ మీద ఆడియన్స్‌ను మెప్పించేందుకు వస్తోందట. సిగరెట్ యాడ్‌లో చిన్నారిగా ఉన్న ఈ పాప హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.