రెబల్ స్టార్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న గ్లోబల్ స్టార్.. ఆ కంట్రీ విలన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆల్ ఇండియా సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేశాడు. గత కొన్నాళ్లుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో తర్వాతి సినిమాలపై పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆల్ ఇండియా సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేశాడు. గత కొన్నాళ్లుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో తర్వాతి సినిమాలపై పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్… ఇదే టైంలో బుచ్చిబాబు సినిమాపై కూడా ఎక్కువగానే ఫొటోస్ పెట్టాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాలని రామ్ చరణ్ గట్టిగానే కష్టపడుతున్నాడు.
ఇక సుకుమార్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభాస్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడట ఈ మెగా హీరో. ఈ సినిమాలో చైనా విలన్ ను తీసుకునేందుకు వర్కౌట్ మొదలుపెట్టాడు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ పుష్ప సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టే విధంగా అడుగులు వేస్తున్నాడు. సుకుమార్ కూడా అదే రేంజ్ లో కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెంచిన సుకుమార్ ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నాడు.
ఇక రాంచరణ్ కోసం గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో ఎక్కువగా పాల్గొంటున్నాడు. ఇదే టైంలో రాంచరణ్ తో చేయబోయే ప్రాజెక్ట్ కథ విషయంలో కూడా పక్కా లెక్కలతో ముందుకు వెళుతున్నాడు సుకుమార్. ఈ సినిమాలో ముందు కొరియన్ విలన్ తీసుకోవాలని భావించినా… చైనా విలన్ ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 7th సెన్స్ సినిమాలో నటించిన విలన్ కోసం సుకుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముందు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
సినిమా ఎలా అయినా సరే దుమ్ము రేపాలని రామ్ చరణ్ పట్టుదలగా ఉన్నాడు. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ మల్టీ స్టారర్ చేశాడు. మల్టీస్టారర్ సినిమా కారణంగా కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్ ను కంప్లీట్ చేసుకోవడానికి వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నాడు రామ్ చరణ్. అందరి స్టార్ హీరోలు మాదిరిగా సినిమాలను లేట్ చేయకుండా వీలైనంత ఫాస్ట్ గా సినిమాలు రిలీజ్ చేసేందుకు గ్లోబల్ స్టార్ ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. త్వరలోనే మరో సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తెలంగాణలో బెనిఫిట్ షోలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.