అరవింద సమేతనే బీట్ చేయలేకపోయిన గ్లోబల్ స్టార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులలోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్స కు వెళ్ళాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అసలేం జరగబోతుంది.. అంటూ అందరూ కూడా కాస్త టెన్షన్ గానే ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 10, 2025 | 01:42 PMLast Updated on: Jan 10, 2025 | 1:42 PM

The Global Star Who Couldnt Beat Aravinda Sametha

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై అభిమానులలోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పీక్స కు వెళ్ళాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది అసలేం జరగబోతుంది.. అంటూ అందరూ కూడా కాస్త టెన్షన్ గానే ఉన్నారు. దీని వెనక రీజన్ కూడా వేరే ఉంది. పుష్పా సినిమా సూపర్ హిట్ కావడం అలాగే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో కచ్చితంగా రామ్ చరణ్ నటించిన సినిమా సూపర్ హిట్ కావాల్సిందే అనే పట్టుదల్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా సూపర్ హిట్. కాబట్టి ఇదే ఫ్లోలో వస్తున్న రాంచరణ్ కూడా మంచి హిట్ కొట్టాలని అభిమానులు కాస్త పట్టుదలగానే కనబడుతున్నారు. ఇక ప్రీ రిలీజ్ మార్కెట్ కూడా ఈ సినిమాకు బానే జరుగుతుంది. అయితే అమెరికాలో మాత్రం ఆశించిన స్థాయిలో జరగటం లేదు అనే ఒపీనియన్ వినపడుతోంది. పుష్ప సినిమాకు దేవర సినిమాకు అమెరికాలో ఫ్రీ రిలీజ్ మార్కెట్ బాగా జరిగింది. అక్కడే భారీ వసూళ్లు సాధించాయి ఆ సినిమాలు. ఇక రిలీజ్ తర్వాత కూడా అక్కడ హడావుడి గట్టిగానే జరిగింది.

కానీ గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాత్రం ఇది చాలా డిఫరెంట్ గా కనబడుతోంది. ప్రీ బుకింగ్ మార్కెట్ విషయంలో కాస్త స్లోగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లెక్కలు ప్రకారం కనీసం కొన్ని సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేయలేక పోయిందనే టాక్ వినపడుతోంది. జస్ట్ ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి అనే కామెంట్స్ తప్పించి సినిమా రికార్డులు బద్దలు కొట్టినట్టు ఎక్కడ రాలేదు. ఇక లేటెస్ట్ గా అరవింద సమేత సినిమా రికార్డులు కూడా గేమ్ చేంజర్ బ్రేక్ చేయలేకపోయింది అని లెక్కలు చెబుతున్నాయి.

అమెరికాలో ప్రీ రిలీజ్ మార్కెట్ అరవింద సమేత కు ఎనిమిది లక్షల 50 వేల డాలర్లు జరిగింది. కానీ గేమ్ చేజర్ సినిమాకు మాత్రం ఆరు లక్షల 90 వేల డాలర్లు మాత్రమే జరిగింది. దీనితో రామ్ చరణ్ ఫాన్స్ కాస్త డీల పడిపోయారు. ఒకవైపున పుష్పా సినిమా అలాగే దేవరా సినిమాలు దాదాపుగా రెండు మిలియన్లు వసూలు చేస్తే ఈ సినిమా మాత్రం కనీసం వన్ మిలియన్ కూడా క్రాస్ చేయలేకపోయింది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్న టైంలో ఈ ఎఫెక్ట్ కచ్చితంగా కలెక్షన్స్ పై పడే ఛాన్స్ ఉంటుంది. అటు కర్ణాటక తమిళనాడులో కూడా ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో ఓపెనింగ్స్ లేవు అనే స్టాక్ వస్తోంది. దీనితో మెగా ఫాన్స్ రికార్డులపై దాదాపుగా నమ్మకం వదిలేసినట్టుగానే కనపడుతుంది. శంకర్ డైరెక్షన్ పై ఫాన్స్ లో కూడా నమ్మకం లేదని టాక్ ఉంది. రీసెంట్ గా వచ్చిన శంకర్ సినిమాలన్నీ ఫ్లాప్ కావడం కూడా ఫాన్స్ ను కంగారు పెడుతుంది.