దేవర, పుష్పకు లేని కష్టాలు.. గేమ్ చేంజర్ ను చుట్టుముట్టాయి

ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయి వసూళ్లు కూడా అదే రేంజ్ లో రావాలి అంటే సింగిల్ గా సినిమా రావాలి. దుమ్ము రేపి వెళ్ళాలి. ఏదైనా చిన్న సినిమా పోటీలో ఉంటే పెద్ద ఇబ్బంది లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 08:33 PMLast Updated on: Jan 02, 2025 | 8:33 PM

The Hardships That Deora And Pushpa Did Not Have Surrounded The Game Changer

ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయి వసూళ్లు కూడా అదే రేంజ్ లో రావాలి అంటే సింగిల్ గా సినిమా రావాలి. దుమ్ము రేపి వెళ్ళాలి. ఏదైనా చిన్న సినిమా పోటీలో ఉంటే పెద్ద ఇబ్బంది లేదు. కానీ పెద్ద సినిమాలు ఉంటే మాత్రం స్టార్ హీరోలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రైళ్లు కూడా కాదు రాకెట్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు మూడు ఏళ్ల నుంచి రామ్ చరణ్ సినిమా వస్తుందని ఫ్యాన్స్ పిచ్చపిచ్చగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతూనే ఉంది.

రీసెంట్ గా అమెరికాలో నిర్వహించిన ఈవెంట్ సూపర్ హిట్ అయింది. త్వరలోనే రాజమండ్రిలో కూడా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ నెల 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు రెడీ అయ్యారు. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వరుసగా అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు సంక్రాంతి ముందే తెచ్చింది.

అటు తమిళంలో కూడా దిల్ రాజుకు మంచి పరిచయాలు ఉండడంతో అక్కడ కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇక శంకర్ కు ఉన్న ఇమేజ్ కూడా తమిళనాడులో ప్లస్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు స్టార్ హీరోల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవానికి గేమ్ చేంజర్ సినిమాకు రెండు సినిమాల నుంచి రికార్డుల ఛాలెంజ్ లు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ నటించిన దేవర, రెండు అల్లు అర్జున్ నటించిన పుష్ప పార్ట్ 2. ఈ రెండు సినిమాల రిలీజ్ టైం లో మరో సినిమా ఇబ్బంది పెట్టలేదు.

కానీ గేమ్ చేంజర్ సినిమాకు మాత్రం ఆరు సినిమాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకటి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కాగా మరొకటి వెంకటేష్ సినిమా. ఆ సినిమాలకు కూడా థియేటర్లను భారీగా కేటాయించడంతో పుష్ప రేంజ్ లో అలాగే దేవరా రేంజ్ లో థియేటర్లో కేటాయించకపోవచ్చు అనే ఆందోళన మొదలైంది. వాళ్ళిద్దరూ సీనియర్ స్టార్ హీరోలు కాబట్టి కచ్చితంగా వాళ్లకు కూడా క్రేజ్ ఉంటుంది. దీనితో ఇక్కడ రామ్ చరణ్ కాంప్రమైజ్ కాక తప్పదు. అలాగే తమిళంలో కూడా అజిత్ నటించిన సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ సంక్రాంతికి తప్పుకోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఏకంగా ఇప్పుడు ఆరు సినిమాలు తమిళంలో గేమ్ చేంజర్ సినిమాకు పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. తెలుగులో రెండు సినిమాలు నుంచి ఇబ్బందులు ఉన్నాయి దీనితో ఒక్కసారిగా ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది.