Prabhas: ప్రాజెక్ట్ కె గ్లింప్స్ ఆగనుందా? యూఎస్ఏ ఈవెంట్ క్యాన్సిల్.?
ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కి ఈ గురువారమే వస్తుందన్నారు. కమల్, ప్రభాస్, దిపికా, నాగ్ అశ్విన్ తోపాటు అమితాబ్ కూడా యూఎస్ లోని శాంటియాగో లో జరిగే కామిక్ కాన్ లో గ్లింప్స్ రివీల్ చేస్తాడన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఈవెంటే ఆగిపోయేలా ఉందనే మాట వినిపిస్తోంది. దానికి కారణం హాలీవుడ్ లో జరుగుతున్న రైటర్స్ స్ట్రైక్.

The impact of the strike going on in Hollywood is going to fall on Prabhas's project K, hence the glimpses of this movie
రెమ్యునరేషన్, తోపాటు జాబ్ విషయంలో తమకి జరిగే అన్యాయాల మీద హాలీవుడ్ రైట్స్ 3 వారాలుగా దర్నా చేస్తన్నారు. వీళ్ల స్ట్రైక్ కి హాలీవుడ్ నటులు కూడా తోడవ్వటంతో, అక్కడ సినిమా షూటింగ్స్ మాత్రమే కాదు, ఈవెంట్లు కూడా రద్దవుతున్నాయి. ఇదే ఇప్పడు ప్రాజెక్ట్ కే గ్లింప్స్ రిలీజ్ కి బ్రేక్ పడేలా చేస్తోంది.
అమెరికాకు చెందిన శాన్ డియాలోగో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ హాలీవుడ్ రైటర్స్ స్ట్రైక్ వల్ల ఆగిపోయేలా ఉంది. అదే జరిగితే, అక్కడికి వెళ్లే ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికా అండ్ కో ఈ ఈవెంట్ కి అటెండ్ కాలేరు. అదే జరిగితే ప్రాజక్ట్ కే టైటిల్, గ్లింప్స్ రావటం జరగదు.. సరే ఈవెంట్ జరక్కున్నా గ్లింప్స్ రివీల్ చేయొచ్చు కదా అంటే కామిక్ కాన్ లాంటి మరో అకేషన్, లొకేషన్ దొరకాలి.. అప్పటి వరకు కష్టమే అంటున్నారు. ఐతే హాలీవుడ్ లో ఎలాంటి స్ట్రైక్ జరిగినా కామిక్ కాన్ ఈవెంట్ మాత్రం ఆగదని కూడా వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఓకే లేదంటే, ప్రాజెక్ట్ కే గ్లింప్స్ గురువారం రావటం కస్టమే.