Indian 2 : భార‌తీయుడు మళ్ళీ వస్తున్నాడు…

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan), స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'భార‌తీయుడు 2'.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 11:45 AMLast Updated on: Apr 15, 2024 | 11:45 AM

The Indian Is Coming Again

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan), స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘భార‌తీయుడు 2’. ‘భార‌తీయుడు’ బ్లాక్ బస్ట‌ర్ త‌ర్వాత వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రానుండ‌టంతో మూవీపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మే నెలాఖ‌రున ట్రైల‌ర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అలాగే జూన్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇండియన్ 2 (Indian 2) పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ 2 (Hindustani 2) పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ రూపొందిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌ (SJ Surya), బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడిట‌ర్‌ గా ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ , ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు.