తమిళ స్టార్ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తున్న కామన్ పీపుల్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎంత డబ్బున్నా సరే.. ఆరోగ్యం లేకపోతే ఇంతే అంటూ విశాల్ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అసలు విశాల్ ఆరోగ్యం ఏమైంది అంటూ జనాల్లో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. వైరల్ ఫీవర్ అని డాక్టర్లు చెప్పినా.. వాస్తవం మాత్రం అది కాదు. ఒక సినిమా షూటింగ్ లో పదేళ్ళ క్రితం గాయపడినప్పుడు వచ్చిన సమస్య.. ఇప్పుడు విశాల్ కు తీవ్రమై వెంటాడుతుంది. ప్రముఖ నిర్మాత జి.కె.రెడ్డి, జానకీదేవిలకు 29 ఆగస్టు 1975న చెన్నైలో జన్మించిన విశాల్.. తెలుగులో కంటే తమిళంలో బాగా ఫేమస్ అయ్యాడు. నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద వేదమ్ అనే సినిమాతో 2001లో సినిమాల్లోకి అడుగుపెట్టిన విశాల్... తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసాడు. అర్జున్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే టైంలోనే ఒక నిర్మాత విశాల్ ను గాంధీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చెల్లమే అనే సినిమాలో నటించడానికి ఒప్పించారు. 2004లో అలా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందుకోసం.. కోథు-పి-పట్టరై వద్ద యాక్టింగ్ నేర్చుకోవడానికి రెడీ అయ్యారు. ఆ తరువాత సందకోళి అనే సినిమా.. మన తెలుగులో పందెం కోడి అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తండ్రి నిర్మాతగా ఈ సినిమాలో విశాల్ నటించాడు. ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత మూడో సినిమా విశాల్ కు హీరోగా మంచి హిట్ ఇచ్చింది. 2008లో విడుదలైన తామిరభరణి.. మన తెలుగులో భరణి సినిమా విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నటుడిగా ఒక్కో సినిమాకు విశాల్ యాక్టింగ్ స్కిల్స్ పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత... తన ఫ్రెండ్ ఆర్య రిఫర్ చేసిన అవన్ ఇవాన్ అనే సినిమాలో నటించాడు విశాల్. ఆ సినిమా కూడా యావరేజ్ హిట్ అయింది. అయితే ఈ సినిమానే విశాల్ జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాల్ ఆరోగ్యం చాలా విషయాల్లో దెబ్బతిన్నట్టు చెప్తారు. షూటింగ్ లో ఒక సీన్ లో... తలకు గాయం కావడంతో... మొదట తీవ్రమైన కంటితో, తలనొప్పితో బాధపడిన.. విశాల్, కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. మెదడుకి కంటికి కలిపే ఒక నరం దెబ్బ తిన్నట్టు వైద్యులు గుర్తించారు. అక్కడి నుంచి ఆరోగ్య సమస్యలు విశాల్ ను వెంటాడుతూ వచ్చాయి. ఆ తర్వాత కోలుకుని 2013లో సమర్ సినిమాలో నటించాడు విశాల్. అదే ఏడాది మరో మూడు సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఆ గాయమే విశాల్ ను ఇబ్బంది పెట్టింది. వైరల్ ఫీవర్ కాదని.. నరాలకు సంబంధించిన సమస్య అంటూ కొందరు డాక్టర్లు క్లారిటీ ఇస్తున్నారు.[embed]https://www.youtube.com/watch?v=P1ZPZ8bmNSw[/embed]