The Kapil Sharma Show: ద కపిల్ శర్మ షో ఆగిపోతుందా? నిజమెంత?

టెలివిజన్‌పై బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన ద కపిల్ శర్మ షో త్వరలో ఆగిపోనుంది. ఇది ఈ షో అభిమానులకు షాకిచ్చే న్యూసే. వచ్చే జూన్‌లో ఈ షో చివరి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మే నెలలోనే చివరి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2023 | 12:42 PMLast Updated on: Apr 16, 2023 | 12:42 PM

The Kapil Sharma Show To Go Off Air Temporarily Once Again

The Kapil Sharma Show: ఇండియన్ టెలివిజన్‌పై బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన షోలలో ద కపిల్ శర్మ షో ఒకటి. ఈ కామెడీ షోను హిందీ ప్రేక్షకులే కాకుండా ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఆదరిస్తుంటారు. కపిల్ శర్మ హోస్టుగా చేసే ఈ షోలో ఆయనతోపాటు అర్చనా పురాన్ సింగ్, కికూ శార్ద, సుమోనా చక్రవర్తి వంటి కమెడియన్స్ నవ్వులు పండిస్తారు.

సినిమారంగంతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అతిథులుగా హాజరవుతుంటారు. కామెడీ నైట్స్ విత కపిల్ అనే షో నుంచి ఈ షో రూపొందింది. ఇంతకీ ఈ షో గురించిన ప్రస్తావన ఇప్పుడెందుకూ అంటే.. ఇంతగా ఆదరణ పొందిన ఈ షో త్వరలో ఆగిపోనుంది. ఇది ఈ షో అభిమానులకు షాకిచ్చే న్యూసే. కాకపోతే ఈ షో శాశ్వతంగా ఆగిపోవట్లేదు. తాత్కాలికంగా మాత్రమే ఈ షోను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వచ్చే జూన్‌లో ఈ షో చివరి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మే నెలలోనే చివరి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. అయితే, జూన్‌లో ఎన్ని వారాలు ప్రసారమవుతుందో ఇంకా నిర్ణయించాల్సి ఉంది. షోను తాత్కాలికంగా రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయి.

షో హోస్ట్ కపిల్ శర్మకు కొన్ని ఇంటర్నేషనల్ టూర్స్ ఉన్నాయి. అందువల్ల చాలా కాలం వరకు అందుబాటులో ఉండరు. పైగా వరుసగా ఎపిసోడ్స్ ప్రసారం చేస్తుంటే ప్రేక్షకులకు కూడా మొనాటనీ వచ్చేస్తుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది. మధ్యలో సీజనల్ బ్రేక్స్ ఇవ్వడం వల్ల ఆర్టిస్టులు కూడా అలసట ఫీల్ అవ్వకుండా, తిరిగి కొత్తగా చేయడానికి అవకాశం ఉంటుంది. షో కంటెంట్, కాన్సెప్టులో మార్పులు చేసేందుకు సమయం దొరుకుతుంది. తర్వాతి సీజన్‌ను అవసరమైతే కొత్త ఆర్టిస్టులతో, కొత్త కాన్సెప్టుతో మొదలుపెట్టొచ్చు. గతంలో ఇలాంటి మార్పులు జరిగినప్పుడు ప్రేక్షకులకు నచ్చాయి. అందుకే ఈసారి కూడా ఇలా చిన్న బ్రేక్ తీసుకుని, తిరిగి మరింత కొత్తగా షోను మొదలుపెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

అయితే, షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. విరామం తర్వాత షోను తిరిగి ప్రారంభిస్తే ప్రేక్షకుల్లో రొటీన్, బోర్ అనే ఫీల్ రాకుండా ఉంటుందని కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఈ షోకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఒక నిర్మాత అనే సంగతి తెలిసిందే.