The Kerala Story: 100 కోట్ల దిశగా కేరళ స్టోరీ..
వివాదాస్పదక కథ అన్నారు. తప్పుడు ప్రొపగండా అంటూ బ్యాన్ చేశారు. ఎంత ఆపాలని చూశారో అంత ఫాస్ట్‌గా దూసుకుపోతోంది ది కేరళ స్టోరీ సినిమా. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తీసిన కేరళ స్టోరీ వారం రోజుల్లోనే 82 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు వీకెండ్ కావడంతో సోమవారానికి ఈ సినిమా 100 కోట్లు ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ట్రైలర్‌తోనే దేశవ్యాప్తంగా కాఫ్లిక్ట్ క్రియేట్ చేసింది కేరళ స్టోరీ. లవ్ జిహాదీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కేరళ స్టోరీ సినిమాకు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురైంది. వెస్ట్ బెంగాల్ లాంటి కొన్ని స్టేట్స్ సినిమాను ఏకంగా బ్యాన్ చేశాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే ప్రమాదం ఉండటంలో తమిళనాడులో కూడా షో నిలిపివేశారు. కేరళ స్టోరీ మేకర్స్ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో వెస్ట్ బెంగాల్‌కు మొట్టికాయలు వేసింది సుప్రీం. దేశం మొత్తం సజావుగానే ఉన్నా వెస్ట్ బెంగాల్‌లో సినిమాను ఎందుకు ఆపారంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వెంటనే కారణం తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది. కానీ ఎవరెంత ఆపాలని చూసినా ది కేరళ స్టోరీ మాత్రం ఆడగడంలేదు.
రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బుకింగ్స్ ఐతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వీకెండ్ కంప్లీట్ అయ్యేలోగా సినిమా వంద కోట్ల మార్క్ దాటడం గ్యారెంటీగా కనిపిస్తోంది. యాక్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసిన అధా శర్మ కెరీర్ కష్టాల్లో ఉన్న టైంలో కేరళ స్టోరీ సినిమా వచ్చింది. ఈ సినిమాలో అధా వందకు వంద మార్కులు కొట్టేసింది. యాక్టింగ్ ఇరగదీసింది. క్యారెక్టర్‌లో అధా జీవించింది అంటున్నారు సినిమా చూసిన ఆడియన్స్. ఈ సినిమా తరువాత అధాకు కొత్త ఆఫర్స్ వచ్చే చాన్సెస్ ఎక్కువ. సినిమాలో ఉన్న గొడవ విషయం పక్కన పెడితే.. అటు బడ్జెట్ పరంగా ప్రొడ్యుసర్లకు, కెరీర్ పరంగా లీడ్ యాక్టర్స్‌కు ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న కేరళ స్టోరీ ఇంకా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.