సల్మాన్ ను ఎలా లేపెస్తామో చెప్పిన లారెన్స్ గ్యాంగ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ వెంటాడుతూనే ఉంది. బాబా సిద్దిఖీ మరణం తర్వాత సల్మాన్ ఖాన్ లో ఆందోళన పీక్స్ కు చేరుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ వెంటాడుతూనే ఉంది. బాబా సిద్దిఖీ మరణం తర్వాత సల్మాన్ ఖాన్ లో ఆందోళన పీక్స్ కు చేరుకుంది. కనీసం ఇంటి నుంచి బయటకు రావాలన్నా సరే సల్మాన్ భయపడిపోతున్నాడు. అతని సినిమాల షూటింగ్ కు కూడా స్వేచ్చగా హాజరు కాలేకపోతున్నాడు ఈ స్టార్ హీరో. ఇక సల్మాన్ ఖాన్ తన బాంద్రా ఇంటి బయట.. కాల్పులు జరిపి సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి సల్మాన్ కు హత్య బెదిరింపులు వచ్చాయి.
ఈసారి, వర్లిలోని ముంబై ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కు చెందిన వాట్సాప్ నెంబర్ కు ఈ బెదిరింపులు వచ్చాయి. అతని ఇంట్లోకి వెళ్లి చంపేస్తామని.. అతని కారును బాంబులతో లేపెస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనితో వర్లి పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసారు. అసలు ఎక్కడి నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ బెదిరింపుల అనంతరం 59 ఏళ్ల సల్మాన్ ఖాన్ ఇంటి బయట భద్రతను కట్టుదిట్టం చేసారు. అతనికి మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా జెడ్ ప్లస్ సమాన భద్రత కల్పిస్తోంది.
అటు సల్మాన్ సన్నిహితులకు సైతం భద్రతను పెంచారు. కొన్నాళ్ళుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక బెదిరింపులు వస్తున్నాయి. 1998 కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఈ గ్యాంగ్ ఆయనను లక్ష్యంగా చేసుకుంది. కృష్ణ జింకలు.. బిష్ణోయ్ సమాజానికి మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 2024 చివర్లో.. కృష్ణ జింకల గుడిని సందర్శించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదా రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్ 30న, కొందరు సల్మాన్ ను బెదిరించి.. 2 కోట్లు డిమాండ్ చేసారు. 2024లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డును ఉపయోగించి ఖాన్ పన్వెల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడటానికి ప్రయత్నించారు. 2023లో, గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ కు బెదిరింపు మెయిల్ కూడా పంపించాడు. అతని ఇంటికి సమీపంలోని ఒక బెంచ్ మీద లేఖను గుర్తించారు. ఇక తనకు వస్తున్న బెదిరింపుల గురించి.. దేవుడు చూస్తున్నాడు అని.. విధి అనుమతించినంత కాలం నా జీవితకాలం ఉంటుంది. అంతే అంటూ సల్మాన్ కామెంట్ చేసాడు.