ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్… ఆడికి ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్
మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ వివాదం పుష్ప ది రూల్ రిలీజ్ తర్వాత కొత్త రూట్ లోకి ఎంటర్ అయింది. లాజిక్స్ లేకుండా వైరల్ చేస్తున్న కొన్ని పోస్ట్ లు ఇప్పుడు చిచ్చుకు పెట్రోల్ పోస్తున్నాయి. ఇప్పటికే తగలబడుతున్న ఇంటిపై కొత్తగా ఫ్యూయల్ పోసి మళ్ళీ ఫ్రెష్ గా అంటించే ప్రయత్నం జరుగుతోంది.
మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ వివాదం పుష్ప ది రూల్ రిలీజ్ తర్వాత కొత్త రూట్ లోకి ఎంటర్ అయింది. లాజిక్స్ లేకుండా వైరల్ చేస్తున్న కొన్ని పోస్ట్ లు ఇప్పుడు చిచ్చుకు పెట్రోల్ పోస్తున్నాయి. ఇప్పటికే తగలబడుతున్న ఇంటిపై కొత్తగా ఫ్యూయల్ పోసి మళ్ళీ ఫ్రెష్ గా అంటించే ప్రయత్నం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు పుష్ప 2 సినిమాలో డైలాగ్స్ అంటూ కొన్ని సినిమా రిలీజ్ అయిన టైం నుంచి వైరల్ అవుతున్నాయి. ఆ డైలాగ్స్ ను సినిమా చూడని వాళ్ళు నిజమే అనుకుంటూ ఇప్పుడు ఫైర్ అయిపోతున్నారు.
ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్… ఆడికి ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ ఒక డైలాగ్, పావలా పర్సంట్ వాటా గాడివి ఏంటి రా నీ మాట వినేది… అని ఇంకొక డైలాగ్, పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెధవకి అని మరో డైలాగ్, రేయ్ నువ్వు ఇలాగే వాగినావో అనంతపురం తీసుకుండపోయి గుండు గీకిస్తా అని ఇంకో డైలాగ్ ఇలా సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. చివరికి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆ డైలాగ్స్ ఉన్నాయని నమ్మేసింది. గత పదేళ్ళ నుంచి మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగుతునే ఉంది.
ఆ చిచ్చు ఆరు నెలల నుంచి ఓ రేంజ్ లో మండుతోంది. పుష్ప 2కు అసలు బన్నీ మెగా ఫ్యామిలీని దగ్గరకు రానీయకపోవడం, అల్లు అర్జున్ అసలు మెగా ఫ్యామిలీ మాట కూడా మాట్లాడకపోవడం, పదే పదే తన ఫ్యాన్స్ గొప్ప అంటూ చెప్పుకోవడం, సినిమా ప్రమోషన్స్ లో బన్నీ యాటిట్యూడ్ అన్నీ కూడా ఈ చిచ్చుకు మరికొంత ఆజ్యం పోశాయి. దీనికి తోడు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా పోస్ట్ లు మరింత రెచ్చగోట్టాయి. రియల్ మెగాస్టార్ నువ్వే అంటూ ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసాడు.
ఇవన్నీ చూసిన వాళ్లకు… వైరల్ అవుతున్న డైలాగ్స్ నిజమే అనే ఫీల్ కలిగింది. ఒక్కో డైలాగ్… మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టే రాసారు. తీరా చూస్తే ఒక్కటి కూడా సినిమాలో లేవు. అవి కచ్చితంగా క్రియేట్ చేసి వైరల్ చేసినవే అనే క్లారిటీ జనాలకు లేట్ గా వచ్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు ఇంకా సినిమా చూడలేదు. వాళ్ళు అవి చూసి గుడ్డలు చించుకున్నారు… నిజమే అని నమ్మిన మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ స్పీడ్ మరింత పెంచారు. చివరకు అసలు లేవు అని తెలిసి అది కేవలం కావాలని క్రియేట్ చేసిందే అంటూ సైలెంట్ అయ్యారు.
వాటిని ఎవరు వైరల్ చేసారు… ఎవరు క్రియేట్ చేసారు అనేది క్లారిటీ లేదు గాని అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ ను మరింత పెంచేలా చేసిన ప్లాన్ ను… కొంత వరకు వర్కౌట్ చేసారు. మెగా ఫ్యాన్స్ నిజమే అని నమ్మి… అల్లు అర్జున్ ను, సుకుమార్ ను నానా బూతులు తిట్టారు. ఇలా ఇప్పుడు పుష్ప 2 సినిమా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ముందు నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ సినిమా ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుందా అనే డౌట్ కూడా రైజ్ అవుతోంది.