186 కోట్ల అవమానం… అల్లు గిల్లుడుతో మెగా ఇన్సల్ట్…
మెగా వర్సెస్ అల్లు యుద్దం ఆగట్లేదా...? పుష్ప 2 వచ్చిపోయింది.. గేమ్ ఛేంజర్ అడ్రస్ లేకుండాపోయింది... ఇదంతా గతం... ఇక అంతా సర్దుకుందనుకుంటే, ఇప్పుడు అల్లు అరవింద్ వచ్చి కెలికేశాడా?
మెగా వర్సెస్ అల్లు యుద్దం ఆగట్లేదా…? పుష్ప 2 వచ్చిపోయింది.. గేమ్ ఛేంజర్ అడ్రస్ లేకుండాపోయింది… ఇదంతా గతం… ఇక అంతా సర్దుకుందనుకుంటే, ఇప్పుడు అల్లు అరవింద్ వచ్చి కెలికేశాడా? ఏదో టంగ్ స్లిప్పయి వచ్చిన ఒక్క మాట, మెగా అవమానంగా మారింది. చరణ్ అంటే ఎంత చిన్న చూపులేకపోతే అలా ఈ టాప్ ప్రొడ్యూసర్ మాట జారతాడు..? ఇలా సోషల్ మీడియాలో తన స్పీచ్ మీద తెగ ట్రోలింగ్ జరుగుతోంది. కొడుకు డైలాగ్ వదిలాక, ఇప్పుడు తండ్రి తగులుకున్నాడా? ఇది సగటు మెగా అభిమాకి ఎక్కడో మండేలా చేస్తోంది… సరే పుష్ప2 హిట్టైందని బన్నీ టీం ఎగిరి పడటానికి లేదు.సంధ్య థియేటర్ సంఘటన తర్వాత పుష్ప2 హిట్టైనా ఆ సంతోషం టీం మెంబర్స్ కి దక్కలేదు. గేమ్ ఛేంజర్ పోయినా శంకర్ వల్లే డ్యామేజ్ కాబట్టి, చరణ్ కి పోయేదేం లేదు. ఇన్ని రియాలిటీస్ ని చూశాక కూడా అల్లు అరవింద్ కి నోరు జారాలని ఎలా అనిపించింది. తను ప్రాక్టికల్ గా నే మాట్లాడి ఉండొచ్చు.. కాని ఇది అల్లు వారి మెగా గిల్లుడంటున్నారు. సోషల్ మీడియా రెండు వైపుల ఫ్యాన్స్ వార్ కి డోర్ మూసేలా లేరు…
మెగా స్టార్ కి బన్నీ దూరం అయ్యాడు. అవుతున్నాడు.. పవన్ కి ఎప్పుడో దూరం అయ్యాడు.. ఇది బేసిగ్గా సినీ జనాల్లో ఉన్న అభిప్రాయం.. సరే ఇలాంటి గొడవలు, మెగా గ్యాప్స్ కామన్ అనుకుందామంటే, అల్లు అరవింద్ లాంటి సీనియర్ ప్రొడ్యూసర్, మెగా మేనమామ కూడా టంగ్ స్లిప్పవ్వటం షాకింగ్ గా మారింది. తండేల్ టీం ని ప్రోత్సహించే ప్రాసెస్ లో అసలు సంబంధమే లేకుండా, దిల్ రాజుని, గేమ్ ఛేంజర్ ఫెల్యూర్ ని గెలికాడు అల్లు అరవింది..
తండేల్ ఈవెంట్ లో ఈ మధ్య దిల్ రాజు చాలా చూశాడన్నాడు. ఒకవైపు పెద్ద ఫ్లాప్ పడ్డా, మరో మూవీ తో ఊహించని స్థాయి హిట్ ని సొంతం చేసుకన్నాడు. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ని కూడా ఇన్వైట్చేశాడంటూ… ఇలా గేమ్ ఛేంజర్ మీద పరోక్షంగా కామెంట్ చేశాడు. ఇది నిజానికి అప్రస్థుతం అనవసరం… బన్నీనో, మరొకరోమెగా వ్యతిరేకతతో ఇలా అన్నారంటే ఏమో అనుకోవచ్చు.. కాని ఎప్పుడూ బ్యాలెన్స్ డ్ గా ఉండే అల్లు అరవింద్ లాంటి సీనియర్ కూడా ఇలా టంగ్ స్లిప్ అవటం ఎవరూ ఊహించలేదు.
మొన్నటికి మొన్న ఓ సీనియర్ జర్నీ లిస్ట్ దిల్ రాజు ను పట్టుుని, గేమ్ ఛేంజర్ వసూళ్ల మీద వదిలిని పోస్టర్ మీదే వదిలారా అన్నాడు. లేదంటే ఎవరైనా రిలీజ్ చేశారా? దీని వెనక ఎవరి ప్రెజర్ ఉందన్నారు. దీనికి దిల్ రాజు కూడా మా వీక్ నెస్ లు మాకుంటాయంటూ, 186 కోట్ల గేమ్ ఛేంజర్ ఓపెనింగ్స్ ఫేక్ అని పరోక్షంగా ఒప్పుకున్నాడు. ఇది కూడా మెగా ఫ్యాన్స్ కి రుచించలేదు.
ఎందుకంటే మొన్నటికి మొన్న మైత్రీ మూవీ మేకర్స్ మీద ఐటీ రైడ్ జరిగింది. అక్కడ పుష్ప 2 తాలూకూ వసూళ్లు 1850 కోట్లు కాదని, సినిమా ప్రమోషన్ కోసమే అలా వేశామని ప్రొడ్యూసర్స్ అన్నారన్నారు. కాని దాని గురించి ఎవరూమాట్లాడట్లేదు. సోషల్ మీడియాలో ఈ విషయం హైలెట్ అయినా, పుష్ప2 హిట్ అవటం వల్లే ఎవరా కామెంట్లు పట్టించుకున్నట్టులేదన్నారు. పుష్ప2 హిట్టే అందులో డౌట్ లేదు. కాని 1000 కోట్ల కలెక్షన్స్ ని 1850 కోట్లంటూ ప్రాచారం చేశారనే కామెంట్స్ ఉన్నాయి.
ఇక్కడ గేమ్ ఛేంజర్ మొత్తానికే ఫ్లాప్ అవటంతో, 186 కోట్ల ఓపెనింగ్స్ మీద కూడా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి పుష్ప 2 హిట్టు, గేమ్ ఛేంజర్ ప్లాన్ అని తేలింది. అందులో ఎలాంటి డిస్ ప్యూట్ లేదు. కాని అల్లు ఆర్మీ గేమ్ ఛేంజర్ మీద చేసిన సోషల్ మీడియా అటాక్ నే మించేలా, అల్లు అరవింద్ స్టేట్ మెంట్ ఉందనంటున్నారు.కొందరైతే ఇది పైశాచిక ఆనందం అనికూడా అంటున్నారు. ఏదేమైనా బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఎంత దూరం పెరిగినా, అల్లు అరవింద్ మాత్రం ఆ రిలేషన్ షిప్ మేయింటేన్ చేస్తుంటాడు…కాని పరోక్షంగా గేమ్ చేంజర్ మీద తను వేసిన సెటైర్ మాత్రం మిస్ ఫైర్ అయ్యిందంటున్నారు.