SSMB29 : జక్కన్న స్ట్రాటజీతో మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

సూపర్ స్టార్‌ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) - జక్కన్న రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2024 | 09:30 AMLast Updated on: Feb 26, 2024 | 9:30 AM

The Mind Has To Be Blank With Jakkannastrategy

సూపర్ స్టార్‌ (Superstar) మహేశ్ బాబు (Mahesh Babu) – జక్కన్న రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి SSMB29ను ఇంక ఏ రేంజ్‌లో తీర్చదిద్దబోతున్నారా అని వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్‌ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా గురించి అఫీషియల్‌గా ఎలాంటి అప్‌డేట్ రానప్పటికీ.. ఈ చిత్రం గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా దాన్ని ఫ్యాన్స్‌ తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త దర్శనమిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది.

ఇంకా పట్టాలెక్కక ముందే ఈ మూవీపై విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఇక.. తన సినిమాలను మార్కెటింగ్ చేసుకోవడంలో రాజమౌళిని మించిన వాళ్లు మరొకరు లేరనే చెప్పాలి. మరి.. ఇప్పుడు మహేశ్‌తో తీయబోతున్న మూవీ హైప్ కి తగ్గట్టుగానే రాజమౌళి తన మార్క్ మార్కెటింగ్ ఈ చిత్రానికి చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి గత చిత్రాల్లానే సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మీడియాతో తన సినిమా కోసం ఓ ప్రెస్ మీట్ ని పెడతారని తెలుస్తోంది. అయితే.. అది గత సినిమాల్లోలాగా కాకుండా.. ఇంకొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడట జక్కన్న.. తనకున్న గ్లోబల్ ఫేమ్‌ ప్రకారం.. రాజమౌళి మహేష్ సినిమా కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెస్ మీడియాతో కలిసి సినిమా అనౌన్సమెంట్ చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి తీసిన గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఏకంగా గ్లోబల్ స్థాయిలో భారతీయ చలనచిత్రాన్ని నిలబెట్టాడు రాజమౌళి.. జేమ్స్ కామెరాన్ వంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రత్యేకంగా మాట్లాడటం, రాజమౌళిని ప్రశంసించడం మరో హైలెట్. దీంతో రాజమౌళి తీసే తరువాతి సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే జక్కన్న ఇంటర్నేషనల్ లెవల్ ప్రెస్‌ మీట్ పై ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇదే నిజం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీకి ఇంటర్నేషనల్ లెవల్‌లో అటెన్షన్ క్రియేట్ అవుతుందని.. అలా తన ఫస్ట్ స్టెప్‌తోనే జక్కన్న తను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడని పరిశీలకులు అంటున్నారు.