Prabhass wedding : ప్రభాస్‌కు పెళ్లి చేయబోతున్నాం.. అమ్మాయి ఎవరంటే..
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ప్రభాసే. మాస్ ఫాలోయింగ్‌తో పాటు హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్. ఎంతో మంది అమ్మాలకు డ్రీమ్ బాయ్. కానీ వాళ్లందరికీ ఓ సాడ్ న్యూస్ చెప్పింది ప్రభాస్ వాళ్ల పెద్దమ్మ. అదే కృష్ణం రాజు గారి భార్య శ్యామల దేవి. త్వరలోనే ప్రభాస్‌కు పెళ్లి చేయబోతున్నారట.

The most eligible bachelor in Tollywood right now is definitely Prabhas Krishnam Rajus wife Shyamala Devi says Prabhass wedding will take place before Dussehra next year
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ప్రభాసే. మాస్ ఫాలోయింగ్‌తో పాటు హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రభాస్. ఎంతో మంది అమ్మాలకు డ్రీమ్ బాయ్. కానీ వాళ్లందరికీ ఓ సాడ్ న్యూస్ చెప్పింది ప్రభాస్ వాళ్ల పెద్దమ్మ. అదే కృష్ణం రాజు గారి భార్య శ్యామల దేవి. త్వరలోనే ప్రభాస్‌కు పెళ్లి చేయబోతున్నారట. రీసెంట్‌గా ఓ ఫంక్షన్‌లో మీడియాతో మాట్లాడిన శ్యామల ప్రభాస్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రభాస్ పెళ్లి గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడంటూ అప్పట్లో తెగ గాసిప్స్ వచ్చాయి. వాళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా మంది మాట్లాడుకున్నారు.
ఆ రూమర్స్ కాస్త సైలెంట్ అవ్వగానే కృతి సనన్‌తో ప్రభాస్ లవ్‌లో ఉన్నాడంటూ గాసిప్స్ వచ్చాయి. వీళ్లిద్దరి మ్యాటర్ అయితే మరీ పీక్స్‌కు వెళ్లింది. ఎవరికీ చెప్పకుండా ప్రభాస్ కృతిని పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఫొటోలు కూడా దర్శనమిచ్చాయి. కానీ అవన్నీ అబద్ధాలే అని తరువాత ప్రూవ్ అయ్యింది. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలి అనుకున్నారో.. లేక ప్రభాస్‌కి తగ్గ జోడీ దొరికిందో తెలియదు కానీ.. త్వరలోనే ప్రభాస్‌కు పెళ్లి చేయబోతున్నట్టు చెప్పారు శ్యామలా దేవి. వచ్చే ఏడాది దసరా రాకముందే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని చెప్పారు. అయితే అమ్మాయి ఎవరు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడిది మరో చర్చకు దారితీసింది. ఖచ్చితంగా కృతి సనన్‌నే పెళ్లి చేసుకోబోతున్నాడంఊ కొందరు. లేదు లాస్ట్ మినట్‌లో అనుష్క పేరు రివీల్ చేస్తారని మరి కొందరు.. ఇలా ఎవరికి నచ్చిన స్క్రిప్ట్‌లు వాళ్లు రాసుకుంటున్నారు. ఈ కామెంట్స్ అన్నీ పక్కన పెడితే.. ఈ టాలీవుడ్ హీ మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్న ఆ లక్కీ గర్ల్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.