Game Changer : ‘గేమ్ ఛేంజర్’ నుంచి బయటికొచ్చిన రామ్ చరణ్
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

The movie 'Game Changer', which is being directed by star director Shankar, is being produced by Dil Raju under the banner of Sri Venkateswara Creations.
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయన్లుగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి మత్రం పూర్తి చేసుకోలేకపోయింది. మధ్యలో కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కారణంగా గేమ్ ఛేంజర్ డిలే అవుతూ వచ్చింది. ఫైనల్‌గా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. జూలై 12న భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత.. గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు శంకర్.
మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు శంకర్. అయితే.. రామ్ చరణ్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రం లేటెస్ట్‌గా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ డే షూటింగ్‌కు సంబంధించిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో.. గేమ్ చేంజర్‌కు రామ్ చరణ్ ఇక గుడ్ బై చెప్పేసినట్టేనని చెప్పాలి. ఈ విషయంలో హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంటున్నాన్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే.. గత మూడేళ్లుగా గేమ్ చేంజర్‌తోనే లాక్ అయ్యాడు చరణ్. ఇప్పుడు తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది అనగానే.. గేమ్ ఛేంజర్ నుంచి బయటికి వచ్చేశాడని ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.
ఇక నెక్స్ట్ బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబు అన్నీ రెడీ చేసుకొని.. చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే.. ఓ నెల రోజుల పాటు చరణ్ ఈ సినిమా కోసం ఆస్ట్రేలియాలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నట్టుగా టాక్ ఉంది. ఆ తర్వాతే ఆర్సీ 16 షూటింగ్ ఉంటుందని సమాచారం. స్పోర్ట్ విలేజ్ డ్రామాగా రాబోతున్న సినిమా కావడంతో.. చరణ్ మేకోవర్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడుంటుందనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.