Natural star Nani : నా లెక్క వేరే నాని.. నాచురల్ కామెంట్స్..

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన హాయ్ నాన్న, మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా వైడ్ గా విడుదలై, భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 18, 2023 | 04:00 PMLast Updated on: Dec 18, 2023 | 4:00 PM

The Movie Hi Nanna Starring Natural Star Nani And Mrinal Thakur

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన హాయ్ నాన్న, మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. పాన్ ఇండియా వైడ్ గా విడుదలై, భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది. అయితే, ఈ వసూళ్లు, రికార్డులు తానేమి పట్టించుకోనని నాని స్పష్టం చేసాడు. శుక్రవారం రోజు నాని సినిమా విడుదలవుతోంది, వెళ్లి చూడాలి అని ప్రేక్షకుడు అనుకున్నానని రోజులు తాను సక్సెస్ లో ఉన్నట్టే అని అన్నాడు. శౌర్య దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న, నాని కెరీర్ లో మరో మెమొరబుల్ హిట్ గా నిలిచింది. పొయెటిక్ ఫ్లేవర్ లో ఉన్న ఈ సినిమాకు, రిపీటెడ్ ఆడియన్స్ వస్తుండడంతో, కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నాని సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉన్న మంచి ఇమేజ్ ను కాపాడుకోవడమే అన్నిటికన్నా పెద్ద గెలుపు అని నాని ఒకింత ఎమోషనల్ కి గురయ్యాడు. సక్సెస్ మీట్ లో నాని చెప్పుకొచ్చిన తన అభిప్రాయానికి, సోషల్ మీడియాలో నాని ఫ్యాన్స్ మెస్మరైజింగ్ కామెంట్స్ తో కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు.