Prabhas : ఇంతకీ ప్రభాస్ ఎక్కడ
కల్కి 2898 ఏడి’ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వెయ్యి కోట్ల చేరువలో ఉంది. అమెరికాలో అప్పుడే 14.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మేకర్స్ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

The movie 'Kalki 2898 AD' has become an epic blockbuster and is raining collections at the box office.
‘కల్కి 2898 ఏడి’ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వెయ్యి కోట్ల చేరువలో ఉంది. అమెరికాలో అప్పుడే 14.5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మేకర్స్ ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రభాస్ బయటికొస్తే మామూలుగా ఉండదు.
జనరల్‌గా అయితే.. మిగతా స్టార్ హీరోలు అయితే, ఇంత పెద్ద సక్సెస్‌ను గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు పార్టీలు కూడా ఇస్తుంటారు. కానీ ప్రభాస్ రూటే సపరేటు. ఫ్యాన్స్‌కు డార్లింగ్ చెప్పే మాట ఒక్కటే. తక్కువ మాట్లాడతాను.. ఎక్కువ సినిమాలు చేస్తాను.. అంటాడు. మరి కల్కి సూపర్ హిట్ అయింది కదా.. ప్రభాస్ ఎక్కడ? అనేదే ఇక్కడ కొందరి డౌట్.
అసలు కల్కి సక్సెస్‌ను ప్రభాస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడా అసలు డార్లింగ్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అంటే, విదేశాల్లో చిల్ మోడ్‌లో ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం డార్లింగ్ ఇటలీలో ఉన్నాడట. తిరిగొచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడట. ప్రజెంట్ మారుతి హీరోయిన్లతో షూటింగ్ చేస్తున్నాడట. జులై చివరి వారంలో డార్లింగ్ రాజాసాబ్ సెట్స్లో అడుగుపెట్టనున్నారని టాక్. ఏదేమైనా సరే.. రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. ముందే విదేశాలకు వెళ్లిపోతాడు ప్రభాస్. ఇప్పుడు కల్కి విషయంలో కూడా అలానే చేశాడు.