Salar 2 Release Update : సలార్-2 రిలీజ్ అప్పుడే…?
యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్.. సలార్ (Salaar) మూవీతో బాక్సాఫీస్‌పై ఎలాంటి దండయాత్ర చేశాడో అందరికీ తెలిసిందే..తన కటౌట్‌కు తగ్గ స్టోరీ పడితే.. డార్లింగ్ ఊచకోత ఎలా ఉంటుందో.. సలార్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

The movie Salaar that brought all the craze after Bahabali and do you know when Salaar 2 will be released..?
యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్.. సలార్ (Salaar) మూవీతో బాక్సాఫీస్‌పై ఎలాంటి దండయాత్ర చేశాడో అందరికీ తెలిసిందే..తన కటౌట్‌కు తగ్గ స్టోరీ పడితే.. డార్లింగ్ ఊచకోత ఎలా ఉంటుందో.. సలార్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది. బాహుబలి 2 (Baahubali) , ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రూ.650 కోట్ల మార్కును దాటిన మూడో తెలుగు సినిమా సలార్ చరిత్ర సృష్టించింది. దీంతో.. సలార్-2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సలార్ 2 (Salaar 2) ఎప్పుడు ఉండబోతుందా అని అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌పై వినిపిస్తున్న ఓ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సలార్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సలార్ 2పై విపరీతమైన బజ్ నెలకొని ఉంది.. ఈ నేపథ్యంలో పార్ట్ 2 ఎప్పుడు, ఎలా ఉండబోతుందంటూ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉంటుంది ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించడంతో ఈ మూవీపై అంచనాలు స్కై హైని తాకాయి. సలార్ రెండో పార్ట్ పై వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి.. 2025 దసరాకి సినిమా రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. దీంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
ఇటీవల సలార్ రెండో పార్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత విజయ్ కిరగందూర్. ”సలార్ 2 స్క్రిప్టు రెడీ అయిందని… సలార్ 1.. పార్ట్ 2కు ట్రైలర్ మాత్రమేనని.. రెండో భాగం ‘”గేమ్ ఆఫ్ థ్రోన్స్’”లా ఊహించని ట్విస్టులతో ఉంటుందని విజయ్ చేసిన కామెంట్లు ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. సీక్వెల్‌లో యాక్షన్, డ్రామా, పాలిటిక్స్.. వంటి చాలా ఆంశాలను కనిపిస్తాయని ఇప్పటికే లీకులు వస్తున్నాయి. దీంతో.. సలార్-2 లో డార్లింగ్ రెబల్ యాక్షన్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.