SSMB 29 : ‘SSMB 29’ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్
అధికారిక ప్రకటన కూడా రాకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'SSMB 29'. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది.

The movie 'SSMB 29' is grabbing the attention of movie lovers all over the world even without an official announcement.
అధికారిక ప్రకటన కూడా రాకుండానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘SSMB 29’. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రమిది. మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా రానున్న ఈ ఫిల్మ్.. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో పాటు, రాజమౌళి-మహేష్ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘SSMB 29’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘SSMB 29’ మూవీని పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ చేయనున్నారని సమాచారం. ఈ లాంచ్ వేడుకకు ఇండియన్ సినిమా సెలబ్రిటీలతో పాటు, హాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని వినికిడి. అలాగే, ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించి, తన కొత్త సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే వివరించడం రాజమౌళి శైలి. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అదే చేశారు. ఇప్పుడు ‘SSMB 29’ కోసం కూడా అదే చేయబోతున్నారట. ఆ ప్రెస్ మీట్.. ఆగస్ట్ 9 కంటే ముందే ఉండే అవకాశముంది అంటున్నారు. ఒకవేళ ముందే ప్రెస్ మీట్ నిర్వహిస్తే.. మహేష్ బర్త్ డే కానుకగా ఒక స్పెషల్ వీడియోని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
మొత్తానికైతే, ఆగస్టు 9 కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి అధికారిక ప్రకటన చేయడంతో పాటు.. ఆగస్టు 9న లాంచ్, స్పెషల్ వీడియో రిలీజ్ ఉంటాయని న్యూస్ వినిపిస్తోంది. ఇది మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.