ఎన్టీఆర్ నీల్ స్టార్ట్.. ఓపెనింగ్ షాట్‌తో పిచ్చెక్కించాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అయింది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అయింది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం ప్రశాంత్ కూడా ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో ఉండటంతో ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఇక ఎన్టీఆర్ దేవర సినిమా కంప్లీట్ అయిన తర్వాత వార్ సీక్వెల్లో ఆడ్ చేయడానికి ముంబై వెళ్లాడు. దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే ఈ సినిమా పై ఫోకస్ పెట్టాడు ఎన్టీఆర్. ఇక వార్ సీక్వెల్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు.
ఇక ప్రశాంత్ డైరెక్షన్లో చేయబోయే సినిమాపై వర్కౌట్ మొదలుపెట్టాడు. లేటెస్ట్ గా ఈ సినిమాస్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే అనౌన్స్మెంట్ వచ్చింది. ముందు ఎనౌన్స్ చేసినట్టుగానే గురువారం నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఓల్డ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్. ఓపెనింగ్ షాట్ చూడటానికి జనాలు భారీగా వచ్చారు. ఓ బాంబు పేలినట్టు కారు పై మంటలు వెనుక భారీగా జనంతో అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేశాడు డైరెక్టర్.
బంగ్లాదేశ్ వెళ్ళిపోయిన తెలుగు కుటుంబాల తరఫున పోరాడే ఒక వీరుడి కథగా ఈ సినిమా రానుంది. ఇక రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ ప్రస్తుతం వారం రోజులు కంటిన్యూ చేస్తాడు డైరెక్టర్. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కలకత్తాలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ షాట్ ఫోటోలను ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమా అనగానే అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. కే జి ఎఫ్ సిరీస్ అలాగే సలార్ సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు.
ఎన్టీఆర్ తో ప్రశాంత్ చేయబోయే సినిమా కోసం ఫాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. సలార్ కంటే ముందే ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం టైం పట్టింది. ఓపెనింగ్ షాట్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేసాడు.