Prabhas: ఆదిపురుష్ ఎఫెక్ట్.. సలార్ టీజర్ కోసం జాగ్రత్తలు..
ఆదిపురుష్ పంచ్ వల్ల ప్రభాస్ తన ఫ్యూచర్ ప్లానింగే మార్చేశాడు. సలార్ టీజర్ కి ఒకరోజు ముందు కొత్త నిర్ణయాలు తీసేసుకున్నాడు. గురువారం లాంచయ్యే టీజర్ లో కంటెంటే కాదు, టీజర్ లాంచింగ్ విధానమే మారిపోతోంది.

The movie team is careful not to let the Adipurush effect fall on the movie Salaar
సలార్ టీజర్ గురువారం రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ లాంచింట్ టైం, డేట్ ని కూడా ఫిల్మ్ టీం తేల్చింది. కాని ఈ సారి ప్రభాస్ సూచనల మేరకు జాగ్రత్తలు పెంచింది ఫిల్మ్ టీం. ఆదిపురుష్ టీజర్ వచ్చినప్పుడు, ఆ గ్రాఫిక్స్, యానిమేషన్స్ మీద కామెంట్ల వరద పెరిగింది.
ఆటీజర్ ఎలా అయితే బ్యాడ్ టాక్ తెచ్చుకుందో, అదే రిజల్ట్ లో కూడా రిఫ్టెక్ల్ అయ్యింది. రాముడిగా ప్రభాస్ ఎంత గంభీరంగా కనిపించినా, ఫ్యాన్స్ ఎంత సంతోషపడ్డా, దర్శకుడి వైఫల్యం వల్ల ఆదిపురుష్ రిజల్ట్ రివర్స్ అయ్యింది.
ఇక రాధేశ్యామ్ టీజర్ లాంచింగ్ కూడా అంచనాలు పెంచేలా చేశారు.తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఏమని తేలిందో అంతా చూశాం. కంటెంట్ ఒకలా ఉంటే, టీజర్ తో అంచనాలు పెంచటమో, నిరుత్సాహపరచటమో చేసి, ప్రభాస్ కెరీర్ కి పంచ్ పడేలా చేశారు దర్శకులు. అలాంటి పరిస్తితి సలార్ కి రాకూడదనే, ఈ టీజర్ లాంచింగ్ ని సింపుల్ గా కానిస్తున్నారట. అంచనాలు మరీ ఎక్కువ పెంచకూడదు, అలాని టీజర్ క్వాలిటీ విషయంలో రాజీలేదు.. అలా నియమం పెట్టుునే నిమిషం లోపే నిడివితో టీజర్ ని లాంచ్ చేస్తోంది సలార్ టీం.