Pawan Kalyan: మూడో భార్యతో పవన్ విడాకులు ? నిజమేనా ?
పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి జరుగుతున్న రచ్చ ఇప్పటిది కాదు. రాజకీయంగానూ ఓ పార్టీకి అధినేత కావడంతో.. పవన్‌ను టార్గెట్ చేయాలనుకున్న ప్రతీసారి పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువస్తుంటారు ప్రత్యర్థి పార్టీ నేతలు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. ఇద్దరికరీ విడాకులు ఇచ్చారు.

The news of Pawan Kalyan's divorce from his wife Anna Leznova is buzzing in Tollywood
ఐతే ఇప్పుడు సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడో భార్యకు కూడా పవన్ కల్యాణ్ డివోర్స్ ఇచ్చారనే న్యూస్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విడిపోయి కూడా చాలా రోజులు అయిందని.. ఆలస్యంగా విషయం బయటకు వచ్చిందని అంటున్నారు మరికొందరు. నిజాని మూడో భార్యతో విడాకులకు సంబంధించి పవన్ నుంచి కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ప్రకటన రాకపోయినా.. ఆ ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. పిల్లలను తీసుకొని పవన్ మూడో భార్య అన్నా లెజ్నోవా.. రష్యా వెళ్లిపోయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారానే వాళ్లతో పవన్ కల్యాణ్ టచ్‌లో ఉన్నారట. విడాకుల వార్త గుప్పుమనడానికి రకరకాల కారణాలు ఉన్నాయ్.
నిజానికి మెగా ఫ్యామిలీలో ఏ కార్యక్రమం జరిగినా.. పవన్ కల్యాణ్ దంపతులు హాజరయ్యేవారు. ఇప్పుడు అలా జరగడం లేదు. వరుణ్‌తేజ్ ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఒక్కటే వచ్చాడు. ఆ తర్వాత వారాహి యాత్రకు ముందు పవన్ కల్యాణ్ నిర్వహించిన యాగంలోనూ అన్నా లెజ్నోవా కనిపించలేదు. గత ఎన్నికల సమయంలో పవన్‌కు ఎదురొచ్చి మరీ బొట్టు పెట్టి సాగనంపిన అన్నా లెజ్నోవా.. ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం ఏంటి అనే గుసగుసలు వినిపించాయ్. ఇక అటు రాంచరణ్, ఉపాసన కుమార్తె క్లిన్‌కారా బారసాల వేడుకలోనూ ఇద్దరూ కనిపించలేదు. దీంతో పవన్, అన్నా లెజ్నోవా విడాకులకు సంబంధించి ఊహాగానాలు జోరందుకున్నాయ్.
ఇందులో నిజం ఎంత అన్న దానిపై అభిమానుల్లో రకరకాల చర్చ జరుగుతోంది. ఐతే ఇలాంటి వార్తల వెనక రాజకీయ కోణం కూడా లేకపోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ప్రత్యర్థులు కావాలనే దీన్ని హైలెట్ చేసి.. మరోసారి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఐతే ఇందులో వాస్తవం ఎంత అనేది త్వరలోనే తేలనుంది. 2013లో పవన్ కల్యాణ్, అన్నా లెజ్నోవా పెళ్లి చేసుకున్నారు. వీరికి పోలేనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.