చిరు మౌనం వీడితేనే సమస్యకు పరిష్కారం

అల్లు అర్జున్ కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వైరం రోజు రోజు కి పెరుగుతుందే తప్పా తగ్గే సూచనలు కనిపించడం లేదు. పుష్ప ని విచారణ కు పిలవడం...,మూడున్నర గంటలు చిక్కడపల్లి స్టేషన్ లో కూర్చోబెట్టి ప్రశించడంతో... బన్నీ కి మున్ముందు బ్యాండ్ బాజా ఇంకా ఉందని అర్థం అవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 25, 2024 | 04:40 PMLast Updated on: Dec 25, 2024 | 4:40 PM

The Only Solution To The Problem Is To Leave A Little Silence

అల్లు అర్జున్ కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వైరం రోజు రోజు కి పెరుగుతుందే తప్పా తగ్గే సూచనలు కనిపించడం లేదు.
పుష్ప ని విచారణ కు పిలవడం…,మూడున్నర గంటలు చిక్కడపల్లి స్టేషన్ లో కూర్చోబెట్టి ప్రశించడంతో… బన్నీ కి మున్ముందు బ్యాండ్ బాజా ఇంకా ఉందని అర్థం అవుతుంది. ఇంత గోల జరుగుతుంటే ఒక్క వ్యక్తి మాత్రం నోరు మెదపకుండా, జరిగేది మౌనంగా చూస్తున్నాడు. కేసు పెట్టిన రోజే ఆయన జోక్యం చేసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. అల్లు అర్జున్ తప్పు పై తప్పు చేసుకుని వెళ్తూ పరిస్థితిని మరింత టైట్ చేసేశాడు.ఇప్పుడు ఇండస్ట్రీ లో, పబ్లిక్ లో అందరూ ఒక్కటే మాట్లాడు కుంటున్నారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు. ఎందుకు నోరుతెరవడం లేదు….ఒక్కసారి మౌనం వీడితే సమస్య సాల్వ్ అయిపోతుంది కదా అని. ఆయనే అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి.

అల్లు అర్జున్…స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకు అల్లు రామలింగయ్యకు మనువడు. మెగాస్టార్ చిరంజీవికి మేనల్లుడు. సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ప్రతి దానికి మెగాస్టార్ చిరంజీవి పేరును వాడేసుకున్నాడు. ఏ సినిమా ఫంక్షన్ అయినా…మెగా పేరు వాడకుండా ఉండలేకపోయాడు. స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు కావడం…మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కావడంతో…సినిమాలో రంగంలో వరుసగా అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద నిర్మాతలు, పేరున్న దర్శకులు…అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చారు. కాలక్రమేణా వరుసగా సినిమాలు హిట్టయ్యాయి. స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఒకవైపు సినిమాలు ఇచ్చిన కిక్కు…మరోవైపు స్టార్ గానూ పేరు సంపాదించాడు. ఇక్కడి కథ బాగానే ఉంది. పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజయి…సూపర్ హిట్టయ్యిందో…బన్నీకి బలుపు పెరిగిపోయింది. చిరంజీవి కుటుంబం ఇమేజ్ నుంచి పక్కకు జరగాలని అనుకున్నాడు. తానే సొంతంగా బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని భావించాడు. ఇంకొకరి సహాకారం, పేరు అవసరం లేదని అనుకున్నాడు.

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా…ఫైర్ అనేలా…అటిట్యూట్ లో పూర్తి మార్పు వచ్చేసింది. ఆడియో ఫంక్షన్లలో మెగాస్టార్ అన్నా…పవన్ కల్యాణ్ అని ఫ్యాన్స్ కేకలు వేస్తే…ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సినిమాల్లో వారి గురించి ఎందుకంటూ మెగాఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడబోనంటూ అహాంకారం ప్రదర్శించాడు. ఒకే ఒక్క పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్ వచ్చింది. అదే సమయంలో నేనే తోపు…ఇంకెవరు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కాదనేలా బిహేవ్ చేశాడు. ఒకానొక సందర్బంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ కంటే…తానే ఎక్కువ అని ఊహించుకున్నాడు. మెగాస్టర్ చిరంజీవి, పవన్ సపోర్ట్ ఉంటే ఎంత ? లేకపోతే ఎంత ? అనేలా ఓవర్ యాక్షన్ చేశాడు. బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు రావడంతో…మనోడు కొవ్వు నరనరాల్లో పెరిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు సాధించలేనిది…తానే సాధించాననేలా కుప్పిగంతులు వేశాడు. అహాంకారం నెత్తికి ఒళ్లు మరచి ప్రవర్తించాడు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అల్లు అర్జున్ మాత్రం వారితో మనకేం పని…మన దారి మనదే…అనుకున్నాడు. తన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్ శిల్పా రవికిశోర్ కోసం…నంద్యాలకు వెళ్లాడు. మెగా కుటుంబం మొత్తం పవన్ వైపు ఉంటే…అల్లు అర్జున్ మాత్రం వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు. దీంతో మెగా ఫ్యామిలీకి కోపం కట్టలు తెంచుకుంది. సమయం వచ్చినపుడల్లా నాగబాబు…ట్వీట్లతోనే చురకలు అంటించాడు. పుష్ప-2 సినిమాలోని డైలాగ్ లు…మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయి. 150 సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ లా బిహేవ్ చేయలేదు. తానే తోపు..తీస్ మార్ ఖాన్ అనేలా అహాంకారం ప్రదర్శించలేదు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత తప్పు జరిగిపోయింది…ఇలా జరగాల్సింది కాదని ఒకే ఒక్క ముక్క చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఏకంగా తెలంగాణ ప్రభుత్వంతోనే సై అంటే సై అన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ అశాసినేషన్ చేస్తున్నారంటూ మీడియా ముందే కామెంట్స్ చేశాడు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని…అంతా పోలీసులే చేశారనేలా ఒల్లు బలిసిన డైలాగ్ లు మాట్లాడాడు. సైలెంట్ ఉండాల్సిన అల్లు అర్జున్…ప్రభుత్వంతోనే కయ్యానికి కాలు దువ్వాడు.

మెగాస్టార్ కుటుంబంతో సఖ్యతగా ఉంటే…అల్లు అర్జున్ అరెస్టయి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రితోనే యుద్దానికి దిగాల్సిన సిట్యూయేషన్ వచ్చి ఉండేది కాదన్న చర్చ మొదలయ్యింది. తొక్కిసలాట జరిగిన రోజే మెగాస్టార్ చిరంజీవి…రంగంలోకి దిగి ఉంటే సీన్ మరోలా ఉండేదంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి…అరెస్టు నుంచి రక్షించేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిరంజీవికి తోడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీన్ లోకి ఎంటరయ్యేవాడని అంటున్నారు. అహంకారంతో చిరంజీవి, పవన్ కల్యాన్ను దూరం చేసుకొని…బన్నీ ఒంటరి వాడు అయ్యాడని పుకార్లు షికార్లు చేస్తున్నాడు. జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్…టాలీవుడ్ బలప్రదర్శనకు దిగడంతో ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పింది. అనుభవం, పరిస్థితులను అంచనా వేసుకున్న చిరంజీవి…తెలివిగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లకుండా ఉండిపోయాడు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి ఫ్యామిలీలో ఎవరు కూడా బన్నీ ఇంటికి వెళ్లకుండా తెలివిగా వ్యవహరించారు. అల్లు అర్జున్ తమ ఇంటికి వచ్చేలా పరిస్థితులు కల్పించారు.

మెగాస్టార్ తో పెట్టుకుని అల్లు అర్జున్ మటాష్ అయిపోయాడు. ఓవర్ ఆటిట్యూడ్ బన్నీని దెబ్బ కొట్టింది.అంతా నా సొంతం, నా బ్రాండ్ అన్న బలుపు పెరిగింది. చిరంజీవి, మెగా ఫ్యామిలీ తో కలసి ఉంటే వాళ్లంతా కష్టం లో కాపు కాసేవారు.ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయాడు బన్నీ.

నిజానికి సంధ్య థియేటర్ సంఘటన జరగగానే చిరంజీవిని సంప్రదించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో వెనక్కి తగ్గి, తనదైన స్టైల్లో చిరు బన్నీ ని కాపాడే వాడు. ముఖ్యమంత్రి తో ఆదిలోనే మాట్లాడి, బాధితులను తానే స్వయంగా కలసి, తగిన సహాయం చేసి సమస్య ఇక్కడితో క్లోజ్ చేసే వాడు. కానీ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ తో ఈ వ్యవహారానికే చిరు దూరంగా ఉన్నాడు. బన్నీ అరెస్ట్ తరవాత బలప్రదర్శన చేస్తే వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నాడు. అల్లు అర్జున్ భార్యని తీసుకుని వెళ్లి కలసినా చిరంజీవి స్తబ్ధత వీడలేదు. అన్నిటికి మించి ఈ వ్యవహారాన్ని మొత్తం గమనిస్తూ….పెదవి విప్పని మరో వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకు అంత తెలుసు. జరిగింది, జరగబోయేది తెలుసు. అయినా మౌనంగానే ఉన్నాడు. పుష్పగాడి బలుపు తగ్గాలనుకున్నాడేమో…, హైదరాబాద్ లో ఉండి కూడా…. అల్లుఅర్జున్ భార్యతో కలసి వచ్చి కలుస్తానన్నా కూడా వాళ్ళని కలవలేదు పవన్. బన్నీ వ్యవహారం లో చిరు, పవన్ అంత కచ్చితంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడిన గంటల్లోనే బన్నీ ప్రెస్ మీట్ పెట్టి సీఎం ని ఛాలెంజ్ చేసినట్లు మాట్లాడాడు. అది మరో పెద్ద తప్పు. ఇదంతా కేవలం చిరంజీవి మౌనం వలన జరిగిన పొరపాట్లే. అల్లు అర్జున్ బలుపుని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. పవన్కల్యాణ్ లాగే రామ్ చరణ్ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు బన్నీ ని కలవలేదు. ఎక్కడ బయటపడలేదు. మెగా ఫ్యామిలీ మొత్తం అంత వ్యహాత్మకంగా మౌనంగా ఉంది. అందుకే ఈ వివాదం దారి తెన్నూ లేకుండా వెళ్తుంది. ఇప్పటికైనా చిరంజీవి రంగం లోకి దిగి అందరితో మాట్లాడి తనదైన శైలి లో పరిష్కరిస్తేనే బన్నీ దీనిలోంచి బయట పడతాడు. లేదా మరింత కూరుకు పోతాడు. బంతి ఇప్పుడు చిరు కోర్ట్ లో ఉంది.