Kalki Prabhas : ‘కల్కి’ ముందు కొండంత టార్గెట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా అంటేనే బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. అలాంటిది 'కల్కి 2898 AD' లాంటి భారీ సినిమా అంటే.. బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా అంటేనే బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. అలాంటిది ‘కల్కి 2898 AD’ లాంటి భారీ సినిమా అంటే.. బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు తగ్గట్టే బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవాలంటే.. ‘బాహుబలి’, ‘సలార్’ని మించిన వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
‘కల్కి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా సౌత్ స్టేట్స్ లో రూ.50 కోట్ల బిజినెస్ చేయగా.. నార్త్ లో రూ.100 కోట్లు, ఓవర్సీస్ లో రూ.100 కోట్ల బిజినెస్ చేసిందట. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా రూ.430 కోట్లకు పైగా షేర్ లేదా రూ.800 కోట్లకు గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది.
ఇప్పటిదాకా ప్రభాస్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-3 సినిమాలను గమనిస్తే.. ‘బాహుబలి-2’ రూ.1800 కోట్ల గ్రాస్, ‘సలార్-1’ రూ.700 కోట్ల గ్రాస్, ‘బాహుబలి-1’ రూ.600 కోట్ల గ్రాస్ రాబట్టాయి. అంటే ఇప్పుడు ‘కల్కి’.. ‘బాహుబలి-1’, ‘సలార్-1’ సినిమాలను మించి కలెక్ట్ చేయాలి. అయితే ‘కల్కి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. రూ.1000 కోట్ల నుంచి లెక్క మొదలవుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.