సమంతను వెంటాడుతున్న గతం.. పాపం ఎన్ని గుర్తు పెట్టుకుందో..?

సినిమాలు చేసినా చేయకపోయినా ఫ్యాన్స్‌తో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది సమంత. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాళ్లను పలకరిస్తూనే ఉంటుంది స్యామ్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 06:45 PMLast Updated on: Mar 05, 2025 | 6:45 PM

The Past That Haunts Samantha How Many Memories Has The Sin Left

సినిమాలు చేసినా చేయకపోయినా ఫ్యాన్స్‌తో మాత్రం ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది సమంత. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాళ్లను పలకరిస్తూనే ఉంటుంది స్యామ్. తాజాగా మరోసారి ఇదే చేసింది. తన 15 ఏళ్ళ కెరీర్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. జీవితంలో కొన్ని విషయాలు మరిచిపోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా మరిచిపోలేం అని.. కానీ కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ వేదాంతం మాట్లాడింది సమంత. అందులో మరీ ముఖ్యంగా తన జీవితంలో ఎంతో ముఖ్యపాత్ర పోషించిన నాగ చైతన్య గురించి కూడా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఆయనతో నటించిన సినిమాల గురించి చెప్పడానికి ఏం వెనకాడలేదు సమంత.

15 ఏళ్ళ కెరీర్ ఒక్కసారి చూసుకుంటే.. ఏ మాయ చేసావే తనకు స్పెషల్ సినిమా అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. తన మొదటి సినిమా మాస్కో కావేరీ తన ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్‌తో కలిసి నటించానని.. అయితే ఒక్కరోజు షూట్ చేసిన తర్వాత దాన్ని ఆపేసారని చెప్పింది స్యామ్. అందుకే ఆ సినిమా గుర్తు పెట్టుకోడానికి ఏం లేదంటూ తెలిపింది స్యామ్. కొన్ని రోజుల తర్వాత దాన్ని పూర్తి చేసినా ఆ సినిమా ఆడలేదు కానీ రాహుల్ మాత్రం 15 ఏళ్ళుగా తన లైఫ్‌లోనే స్పెషల్ ప్లేస్ సంపాదించాడని చెప్పింది సమంత. అయితే ఏ మాయ చేసావే మాత్రం తనకు ప్రతీ ఒక్క విషయం గుర్తుకుంది అని చెప్పుకొచ్చింది ఈ ముద్గుగుమ్మ.

గేట్ దగ్గర నిలబడి కార్తిక్‌ను కలిసేది తనకు ఫస్ట్ సీన్ అని.. ఆ తర్వాత కూడా ప్రతీ షాట్ తనకు అలా మెమొరీలో ఉండిపోయిందని చెప్పింది సమంత. ఆ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్‌తో పని చేయడం తనకు అద్భుతమైన తీపి జ్ఞాపకం అని.. ఏ మాయ చేసావే ఎప్పటికీ తనకు స్పెషలే అని చెప్పింది ఈ బ్యూటీ. అయితే నాగ చైతన్య పేరు గానీ.. అతడితో నటించిన అనుభవం గురించి గానీ ఎక్కడా చెప్పలేదు స్యామ్. 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలున్నాయని.. తన జీవితంలో దేనికి మినహాయింపేమీ లేదంటుంది ఈ భామ. ఇన్నేళ్ల కెరీర్‌లో అన్నీ చూసేసానంటుంది స్యామ్. ఇన్నేళ్లలో తన బలమేంటి.. బలహీనతలేంటి అర్థం చేసుకున్నానని.. రాబోయే 15 ఏళ్ళ కోసం వేచి చూస్తున్నానని చెప్పింది స్యామ్. ఏదేమైనా ఈమెను గతం ఇంకా వెంటాడుతూనే ఉంది.