ఎన్టీఆర్ నడిచిన దారి… గొప్ప మార్గదర్శని తేల్చాడా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రూట్లోనడుస్తున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. అలా ఇలా కాదు అచ్చుగుద్దినట్టు తన దారిలోనే నడవాలని ప్రిపేర్ అయినట్టున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2025 | 10:30 PMLast Updated on: Apr 22, 2025 | 10:30 PM

The Path That Ntr Walked Was It Marked By A Great Guide

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రూట్లోనడుస్తున్నాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. అలా ఇలా కాదు అచ్చుగుద్దినట్టు తన దారిలోనే నడవాలని ప్రిపేర్ అయినట్టున్నాడు. అదే తనకిప్పుడు కలిసొచ్చేలా ఉంది. మొన్నటికి మొన్న కేజీయఫ్ 2 తర్వాత టాక్సిక్ అని ఫిక్స్ అయ్యాడు. గ్లింప్స్ వస్తే కామెంట్ల దాడిని ఫేస్ చేశాడు. అలాంటి తను ఆల్ ఆఫ్ సడన్ గా ఎన్టీఆర్ లానే హిందీ మంత్రమేశాడు. అంతే దెబ్బకి అంచనాలు మారిపోయాయి. రామాయణ్ లో రావణుడిగా నటిస్తున్న తను, మరో విషయంలోకూడా అచ్చు గుద్దినట్టు ఎన్టీఆర్ దారిలోనే నడుస్తున్నాడు. విచిత్రం ఏంటంటే కేజీయఫ్, కేజీయఫ్ 2 ఇలా రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లు తనకి దక్కాయి. పుష్ప, పుస్ఫ తో బన్నీకి కూడా రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డాయి. ఎన్టీఆర్ కి కూడా త్రిబుల్ ఆర్ తర్వాత దేవర లాంటి రెండో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడింది.. అలా చూస్తే అందరికీ సమానంగానే పాన్ ఇండియా హిట్ల సంఖ్య ఉంది.. అయినా ఎన్టీఆర్ స్ట్రాటజీనే వెరీ వెరీ స్పెషల్ అంటున్నారు, బన్నీ, యష్ ఎందుకు..? అదేంటో చూసేయండి.

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందే బాహుబలితో… తర్వాత కేజీయఫ్ తో సీన్ లోకి కన్నడ స్టార్ యష్ వచ్చాడు. ఆతర్వాతే పుష్పతో బన్నీ, త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్, చరణ్ వచ్చారు. ట్రెండ్ సెట్ చేశారు. ఎలా చూసినా ప్రభాస్ తర్వాత పాన్ ఇండియాని షేక్ చేసి రెండో సౌత్ ఇండియా మాత్రం రాకింగ్ స్టార్ యష్ మాత్రమే..అలాంటి ఈ హీరో ఇప్పుడు ఎన్టీఆర్ దారిలో నడవాల్సి వస్తోంది. కావాలని చేయకున్నా తనకి ఎన్టీఆర్ లాంటి పరిస్థితే బాగా కలిసొస్తున్నట్టుంది. త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ పడ్డాక ఎన్టీఆర్ ఊర మాస్ మూవీ దేవర చేశాడు. కట్ చేస్తే ఆవెంటనే బాలీవుడ్ బాట పట్టాడు. హిందీలో వార్ 2మూవీ చేశాడు. విచిత్రమేంటంటే, పాన్ ఇండియా కింగ్ అనిపించుకునే ఇమేజ్ వచ్చినా, వార్ 2 లో మాత్రం విలనిజాన్నే చూపించేందుకు ఫిక్స్ అయ్యాడు.

అలా వార్ 2 ని ఎన్టీఆర్ పూర్తిచేశాడు. కేవలం సగం సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్. అయితే అచ్చు గుద్దినట్టు తనతో కన్నడ స్టార్ యష్ జర్నీని పోల్చేలా పరిస్థితులు డిట్టో కనిపిస్తున్నాయి. తను కేజీయఫ్ రెండు భాగాలు హిట్ అయ్యాక, ఊర మాస్ మూవీ టాక్సిక్ చేశాడు. ఇంకా చేస్తున్నాడు.ఆతర్వాత ఏం చేస్తాడో ఆలోచోంచే లోపే రామాయణ్ లో అడుగుపెట్టాడు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా రామాయణంలో రావణుడిపాత్ర వేశాడు. దంగల్ తీసిన నితీష్ తీవారినే ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. రామాయణం రెండో భాగం కూడా మొదలవ్వబోతోంది.

విచిత్రం ఏంటంటే త్రిబుల్ ఆర్ తర్వతా ఎన్టీఆర్ దేవర చేయటం, వార్ 2 లో విలనిజానికి సిద్దపడటం… అలానే యష్ కూడా కేజీయఫ్ తర్వాత టాక్సిక్ చేయటం, తర్వాత బాలీవుడ్ లో విలన్ గా మారి రావణుడిగా ఫిక్స్ అవటం.. ఇలా వరుసగా ఎన్టీఆర్ జర్నీలానే యష్ జర్నీ కనిపిస్తోంది. ఇదే విషయం బాలీవుడ్ మీడియా నుంచి తనకి ప్రశ్నరూపంలో ఎదురైతే… తనకి రాజమౌళి పాన్ ఇండియా మార్గదర్శి అయితే, ఎన్టీఆర్ మాస్ మార్గదర్శన్నాడు.. ఇది నిజంగా షాకింగ్ స్టేట్ మెంటే.. అంటే మాస్ రూట్లో పాన్ ఇండియా అప్రోచ్ ఎలా ఉండాలో ఎన్టీఆర్ ఆర్ ని అబ్జర్వ్ చేస్తున్నాట్టే అని చెప్పకనే చెప్పినట్టౌతోంది.