Varun Tej: యాక్షన్‌ మోడ్‌లో వరుణ్‌ తేజ్‌.. గాండీవధారి అర్జున ప్రీ టీజర్‌ రిలీజ్‌..

మెగా ప్రిన్స్‌ వరున్‌ తేజ్‌ హీరోగా వస్తన్న గాండీవధారి అర్జున సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ-టీజర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌ తనకు మరింత ఊపునిచ్చిందంటూ వరుణ్‌ తేజ్‌ ట్విటర్‌లో ప్రీ-టీజర్‌ను పోస్ట్‌ చేశాడు. జస్ట్‌ 41 సెకన్లు మాత్రమే ఉన్న ఈ ప్రీ-టీజర్‌లో సినిమాలో ఏ రేంజ్‌ యాక్షన్‌ ఉందో చూపించేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 01:41 PMLast Updated on: Jul 12, 2023 | 1:41 PM

The Pre Teaser Of Mega Hero Varun Tejs Gandhivadhari Arjuna Has Been Released

ఫుల్‌ లెంత్‌ యాక్షన్‌ మూవీగా వస్తున్న గాండీంధారి అర్జున సినిమాలో వరుణ్‌తేజ్‌ రా-ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం బాడీ పెంచేసి ఏజెంట్‌ మోడ్‌లోకి మారిపోయాడు వరుణ్‌ తేజ్‌. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. 41 సెకన్లు ఉన్న ప్రీ-టీజర్‌లో మొత్తం ఛేజింగ్‌, ఫైట్‌ సీన్స్‌ చూపించారు. వెపన్స్‌ పట్టుకుని వరుణ్‌ తేజ్‌ నడుస్తూ వస్తుంటే హాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్నాడు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్‌ ఇరగదీశాడు. ప్రీ-టీజర్‌ టీజర్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇంటెన్సివ్‌గా ఉంది. నార్మల్‌గా రా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా అంటేనే గన్స్‌, ఫైట్స్‌ మధ్యే కథ మొత్తం సాగుతుంది. ఈ సినిమా కూడా అదే కోవలో వస్తోంది. ఆగస్ట్‌ 25న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే దాదాపు షూటింగ్‌ కూడా పూర్తైంది. త్వరలోనే ఈ సినిమాను టీజర్‌ రిలీజ్‌ చేయబోతున్నారు.