Prabhas : ప్రభాస్’ ప్రేమ యుద్ధం..

బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన లవ్ స్టోరీ సినిమా రాధే శ్యామ్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుంత బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2024 | 11:45 AMLast Updated on: Jun 20, 2024 | 11:45 AM

The Pure Love Stories In Prabhas Career Are Darling And Mr Perfect

 

 

ప్రభాస్ కెరీర్లో ప్యూర్ లవ్ స్టోరీస్ అంటే, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలనే చెప్పాలి. అయితే.. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు ప్రభాస్. కానీ ఇప్పుడు ప్రేమ యుద్ధానికి రెడీ అవుతున్నాడు డార్లింగ్.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన లవ్ స్టోరీ సినిమా రాధే శ్యామ్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుంత బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికైతే.. జూన్ 27న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని అంటున్నారు. సినిమా హిట్ అయినా పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడనేది చెప్పడం కష్టం. ఎందుకంటే.. త్వరలోనే సలార్ 2 షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రజెంట్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడు సందీప్. ఆ తర్వాత హనురాఘవపూడితో ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు డార్లింగ్. సీతారామం వంటి క్లాసికల్ హిట్ తర్వాత ప్రభాస్‌తో భారీగా ప్లాన్ చేస్తున్నాడు హను రాఘవపూడి.

ఇప్పటికే హను చెప్పిన కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ‘వరల్డ్ వార్ 2’ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ చేయబోయే ప్రేమ యుద్ధం మామూలుగా ఉండదని అంటున్నారు. లేటెస్ట్‌గా.. ఈ సినిమా లుక్ టెస్ట్‌కు ప్రభాస్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఫోటో షూట్ కోసం హను రాఘవపూడి ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు హను రాఘవపూడి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్ర శేఖర్ ఫైనల్ అయినట్టుగా సమాచారం. ఈ లెక్కన.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి హను, ప్రభాస్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.