KALKI 2898 AD: గ్రాఫిక్స్ విషయంలో కల్కిని మించేలా రాజా సాబ్?
ఇండియన్ మూవీస్‌లో రూ.200 కోట్ల ఖర్చుతో భారీగా తెరకెక్కుతున్న మొదటి మూవీ కల్కి 2898 ఏడీ. విచిత్రం ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి, అంత భారీగా కల్కి తీస్తుంటే, ఈ సినిమానే మించే వీఎఫ్‌ఎక్స్‌ని రాజా సాబ్‌లో వాడారనటం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.
KALKI 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి బడ్జెట్ రూ.570 కోట్లు. ఇందులో రూ.200 కోట్లు కేవలం గ్రాఫిక్స్‌కే పెట్టారు. రూ.200 కోట్లు స్టార్ కాస్ట్‌కి, క్రూ మెంబర్స్ రెమ్యునరేషన్‌కి సరిపోయింది. రూ.170 కోట్లు మేకింగ్ కాస్ట్ అని తెలుస్తోంది. ఇలా చూస్తే ఇండియన్ సినిమాల్లోనే రూ.200 కోట్లు కేవలం గ్రాఫిక్స్‌కి కేటాయించటం జరగలేదు. ఆలెక్కన ఇండియన్ మూవీస్‌లో రూ.200 కోట్ల ఖర్చుతో భారీగా తెరకెక్కుతున్న మొదటి మూవీ కల్కి 2898 ఏడీ.
Upasana Kamineni: మండిపాటు.. ఉపాసనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్
విచిత్రం ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి, అంత భారీగా కల్కి తీస్తుంటే, ఈ సినిమానే మించే వీఎఫ్‌ఎక్స్‌ని రాజా సాబ్‌లో వాడారనటం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. ఎందుకంటే ప్రభాస్‌తో మారుతి తీస్తున్న ది రాజా సాబ్ మూవీ బడ్జెట్టే రూ.340 కోట్లు. అంటే సుమారు కల్కిలో సగం. అలాంటి ఈ మూవీలో కల్కి కంటే భారీగా వీఎఫ్‌ఎక్స్ వాడుతున్నారంటే నమ్మేదెలా..? ఈ ప్రశ్నకి సమాధానం ఉంది. ఖచ్చితంగా కల్కి కంటే భారీగా ది రాజా సాబ్‌లోనే వీఎఫ్ ఎక్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆదిపురుష్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో యానిమేషన్‌ని వాడారు. దానికి ఎఫెక్టివ్‌నెస్ మామూలుగా ఉన్నా, కాస్ట్ ఎక్కువ. అలానే కల్కిలో కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారు. వీటి ఖర్చు కూడా కాస్త ఎక్కువే. కాబట్టి 200 కోట్లు ఖర్చు చేశారంటే మనీ పరంగా పెద్ద విషయమే.
వీటితో పోలిస్తే వీఎఫ్ ఎక్స్ ఖర్చు తక్కువ, ఎఫెక్ట్ ఎక్కువ. అలాగని అన్నింటినీ ఒకే గాటున పెట్టలేం. రాజా సాబ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ వాడటం, సీన్లు అలా కుదరటం పట్టి చూస్తే, కల్కి సీజీ వర్క్ కంటే భారీతనం కనిపించేలా ఉందట. అలాగని అంతా వీఎఫ్ఎక్స్ వైపే అడుగులేయొచ్చు కదా అంటే, ఎంచుకున్న కథ, డిమాండ్ చేసే సీన్లను బట్టి ఏ టెక్నాలజీ సూట్ అవుతోంది అదే వాడాలి.