The Raja Saab: ఫ్యాన్స్ రిలాక్స్.. ఆ పిక్ ప్రభాస్‌ది కాదు

ప్రభాస్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మాస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ రాజా సాబ్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వచ్చిన తాజా న్యూస్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 02:05 PMLast Updated on: Feb 09, 2024 | 2:05 PM

The Raja Saab Leaked Pic It Is Not Prabhas Pic

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ నయా మూవీ రాజాసాబ్. ఈ టైటిల్ ఒక్కటి చాలు.. మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చెప్పడానికి. పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి అందరి కళ్ళు రాజా సాబ్ మీద పడ్డాయి. ఎందుకంటే ప్రభాస్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మాస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీ రాజా సాబ్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి వచ్చిన తాజా న్యూస్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

Anushka Shetty: లెక్క మారింది.. పవన్ ఔట్.. అనుష్క ఇన్

రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కొన్ని రోజుల క్రితం రాజాసాబ్‌లోని ఓ ఫైట్ సీక్వెన్స్‌కి సంబంధించిన పిక్ అంటు ఒకటి లీక్ అయ్యింది. ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ కూడా అయ్యింది. అయితే తాజాగా ఇది మళ్ళీ వైరల్‌గా మారడంతో ది రాజా సాబ్ డైరెక్టర్ మారుతి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎస్‌కేఎన్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. అందరూ అనుకుంటున్నటుగా ఆ పిక్ రాజాసాబ్ లోనిది కాదని చెప్పాడు. మారుతికి అత్యంత సన్నిహితుడైన ఎస్‌కేఎన్ చెప్పడంతో ప్రభాస్ ఫాన్స్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ తాలూకు భావజాలంతో రాజాసాబ్ అత్యంత భారీ వ్యయంతో, ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటుంది. మారుతి ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్‌ని మారుతి ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలోను ఉంది. పీపుల్స్ మీడియా ఫాక్టరీపై నిర్మాణం జరుపుంటున్న రాజా సాబ్‌కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.