ది రాజా సాబ్ vs అఖండ 2… 1000 కోట్ల క్రికెట్ టీంతో చరణ్…

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ రిలీజ్ డేట్ మారింది. ఏప్రిల్ 10 నుంచి మే కి షిఫ్ట్ అనుకునేలోపు జూన్ అన్నారు. కాని ఇప్పుడు దసరాకే

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2025 | 06:33 PMLast Updated on: Feb 21, 2025 | 6:33 PM

The Raja Saab Vs Akhanda 2 Charan With 1000 Crore Cricket Team

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ రిలీజ్ డేట్ మారింది. ఏప్రిల్ 10 నుంచి మే కి షిఫ్ట్ అనుకునేలోపు జూన్ అన్నారు. కాని ఇప్పుడు దసరాకే ఈ సినిమా రిలీజ్ అంటున్నారు. నిజానికి జులై ఎండ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. దీంతో ఆగస్ట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ వార్ 2 తో పోటీ ఉండొచ్చనుకున్నారు. ఇంతలో సీన్ దసరాకు షిఫ్ట్ అయ్యింది. అంటే అబ్బాయ్ తో మిస్ అయిన వార్ తన బాబాయ్ బాలయ్యతో ఉండేలా ఉందా? ఫైనల్ గా ది రాజా సాబ్ మూవీ అఖండ 2 సీక్వెల్ తో పోటీ పడేలా ఉందా? ఈ డౌట్ కి ఆన్సర్ దొరికేలోపే దసరాకి మరో స్టార్ రామ్ చరణ్ కూడా రంగంలోకి దిగేలా ఉన్నాడు. బుచ్చి బాబు తో ప్లాన్ చేసిన మూవీ ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాది ఎండ్ లోగా రావాలనేది చరణ్ కండీషనని తెలుస్తోంది. అలా దసరా ముహుర్తాన్ని టార్గెట్ చేస్తున్న ఫిల్మ్ టీం దీపావళిని బ్యాక్ అప్ ప్లాన్ గా పెట్టుకుందట. అంతవరకు బానే ఉంది. కాని ప్రభాస్, బాలయ్యని ఎదురించటానికి చరణ్ రంగంలోకి క్రికెట్ స్టార్ ధోనీని దింపబోతున్నాడనే మ్యాటరే వైరలయ్యేలా ఉంది. మెగా గ్లోబల్ స్టార్ కోసం లగాన్ బ్యాట్ తో సీన్ లోకి ధోనీ కూడా వచ్చేందుకు సిద్దపడ్డాడు… ఆ సంగతేంటో చూసేయండి.

రెబల్ స్టార్ ప్రబాస్, నటసింహం బాలయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ముగ్గురు ఎప్పుడు బాక్సాఫీస్ లో పోటీ పడలేదు.. పోటీ పడటానికి ఈ ముగ్గురు చిన్న కటౌట్లు కాదు… ఆల్రెడీ ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా కింగ్. తన సినిమా వస్తోందంటే అందరి మూవీలు సైడ్ ఇవ్వాల్సిందే. చరణ్ సినిమాకు కూడా ఎవరూ పోటీ ఇచ్చే సాహసం చేయరు. కారణం తను కూడా పాన్ ఇండియా స్టారే.అంటే ఒక హీరో కి భయపడి మరో స్టార్ తన సినిమాను సైడ్ కి పెట్టడం కాదు… పాన్ ఇండియా మూవీ వస్తోందంటే, ఎవరైనా సైడ్ ఇవ్వాల్సిందే.. ఇది ఒక అన్ అఫీషియల్ రూల్… ఇండస్ట్రీలో సైలెంట్ గా అంతా ఫాలో అవుతున్నారు. ఇదోరకంగా పాన్ ఇండియా బడ్జెట్ తో తెరకెక్కేసినిమాకు మిగతా హీరోలు ఇచ్చే అన్ అఫీషియల్ గౌరవం..

ఐతే ది రాజా సాబ్ ఏప్రిల్ 10 కి రావాల్సింది. షూటింగ్ డిలే అవటం వల్ల, మే, జూన్, జులై ఇలా రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ది రాజా సాబ్ విడుదల తేదీ దసరాకు షిఫ్ట్ అయినట్టుకనిపిస్తోంది.కాని అప్పుడు నటసింహం బాలయ్యతో బోయపాటి తీస్తున్న అఖండ2 ని రిలీజ్ చేస్తామని తేల్చారు. కాబట్టి వాయిదా కష్టమే. ఒకవేళ షూటింగ్ డిలే అవటం, లేదంటే ది రాజా సాబ్ టీంతో అఖండ 2 టీం ఏదైనా మాట ఇచ్చిపుచ్చుకోవాటం చేస్తే చెప్పలేం.. కాని ఇప్పటి వరకు రెబల్ స్టార్ మూవీ ది రాజా సాబ్,అఖండ 2 తో టాలీవుడ్ లోనే కాదు, పాన్ఇండియా లెవల్లో పోటీ పడాల్సి వచ్చేలా ఉంది

కట్ చేస్తే ఇదే డేట్ కి రామ్ చరణ్ మూవీ వచ్చేలా ఉంది. దసరాకు పెద్ద సినిమా రిలీజ్ అంటున్నారు. మొన్నీమధ్యే సెట్స్ పైకెళ్లిన ఈ సినిమా అప్పుడే 15 శాతం షూటింగ్ జరుపుకుంది. మొన్నటికి మొన్న 20 రోజుల పాటు క్రికెట్ మ్యాచ్ బ్యాక్ డ్రాప్ తో సీన్లు తెరకెక్కించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇక్కడ విచిత్రం ఏంటంటే చరణ్ చేస్తున్న మూవీ శ్రీకాకులం బాహుబలి కోడి రామమూర్తి బయోపిక్ కాదు… అలాని లగాన్ స్టైల్లో పూర్తి స్థాయి క్రికెట్ మూవీ కూడా కాదు. కాని ఇందులో 30 నిమిషాల క్రికెట్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఆల్రెడీ రత్న వేలు ఈ విషయం ఎప్పుడో ట్విట్టర్ లో తేల్చాడు.ఐతే ఇక్కడ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే, ఇందులో 15 నిమిషాల పాటు మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎమ్మెస్ దోనీ గెస్ట్ రోల్ వేయటం. అంతేకాదు దసరా రిలీజ్ ని కేవలం ఆప్షన్ గా పెట్టుకున్నారు. దీపావళికి పెద్దిని రంగంలోకి దించేలా ఉన్నారు. మొత్తానికి, ఏ దసరాకు, దీపావళికి లేని వసూళ్ల కల ఈ సారి ఉండేలా ఉంది.