Kalki : రిలీజ్ డేట్ ఇంకా క్లారిటీ రాలేదు…
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'కల్కి 2898 AD'.

The release date is not yet clear...
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘కల్కి 2898 AD’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ (Science Fiction Film) ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. మే 9న విడుదల కావాల్సిన ఈ మూవీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ కోసం ప్రభాస్ అభిమానులతో సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈరోజు రిలీజ్ డేట్ క్లారిటీ వస్తుంది అనుకుంటే నిరాశే ఎదురైంది.
‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఈ సాయంత్రం గ్లింప్స్ ను విడుదల చేశారు. 21 సెకన్ల నిడివి గల గ్లింప్స్ పవర్ ఫుల్ గా ఉంది. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ని పరిచయం చేసిన తీరు, విజువల్స్, బీజీఎం అదిరిపోయాయి.
అయితే ‘కల్కి 2898 AD’ నుంచి అప్డేట్ వస్తుందని న్యూస్ రాగానే.. రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని భావించారంతా. కానీ రిలీజ్ డేట్ ఇంకా క్లారిటీ రాలేదు. నిర్మాతలు జూన్ 30న విడుదల చేయాలని భావిస్తుండగా, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం మే 30న విడుదల చేయమని అడుగుతున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.