Devara : మళ్ళీ మారనున్న ‘దేవర’ రిలీజ్ డేట్
టాలీవుడ్ (Tollywood) లో రూపొందుతోన్న భారీ సినిమాల రిలీజ్ డేట్ లు మారిపోవడం అనేది కామన్ అయిపోయింది. అదే బాటలో 'దేవర' (Devara) కూడా పయనిస్తోంది. మొదట ఈ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయాలి అనుకోగా.. వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యమవుతుండటంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు.
టాలీవుడ్ (Tollywood) లో రూపొందుతోన్న భారీ సినిమాల రిలీజ్ డేట్ లు మారిపోవడం అనేది కామన్ అయిపోయింది. అదే బాటలో ‘దేవర’ (Devara) కూడా పయనిస్తోంది. మొదట ఈ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయాలి అనుకోగా.. వీఎఫ్ఎక్స్ వర్క్ మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యమవుతుండటంతో అక్టోబర్ 10కి వాయిదా వేశారు. ఇప్పుడు ఈ తేదీ కూడా మారే అవకాశముందని తెలుస్తోంది. అయితే మిగతా సినిమాల్లాగా మరోసారి పోస్ట్ పోన్ కాకుండా.. ప్రీ పోన్ అయ్యే అవకాశముందని సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే హాలీవుడ్ స్టాండర్డ్స్ లో భారీ బడ్జెట్ నిర్మిస్తున్నాయి. మొదట ఈ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయాలి అనుకున్నారు. పక్కా ప్లానింగ్ తో దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేశారు. అయితే ఇందులో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి గాయమవ్వడం, వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం పడుతుండటం, పాటల రికార్డింగ్ పూర్తి కాకపోవడం వంటి కారణాలతో సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది.
నిజానికి జూన్ లేదా జులై నాటికే దేవర సినిమా కంప్లీట్ అవుట్ పుట్ రెడీ అవుతుందట. కానీ సరైన తేదీ దొరక్కపోవడంతోనే.. అక్టోబర్ లో విడుదల చేయాలని నిర్ణయిచుకున్నారట. ఒకవేళ ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘పుష్ప-2’ వాయిదా పడితే.. ఆ తేదికి రావాలని ‘దేవర’ టీం భావిస్తోందట. ‘పుష్ప-2’ వాయిదా పడనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఆ మూవీ టీం మాత్రం ఆగస్టు 15 కే వస్తామని చెబుతోంది. అందుకే ‘దేవర’ టీం ప్రస్తుతం దసరా హాలిడేస్ ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 10వ తేదీపై కర్చీఫ్ వేసిందట. ఒకవేళ ‘పుష్ప-2’ వాయిదా పడితే ఆగస్టు 15కి రావాలని, లేదంటే ఇటీవల ప్రకటించినట్లుగానే అక్టోబర్ 10కి రావాలి అనేది ‘దేవర’ టీం ప్లాన్ అట. మొత్తానికి ‘దేవర’ కొత్త విడుదల తేదీ మార్పు అనేది ‘పుష్ప-2’పై ఆధారపడి ఉంది.