Ram charan : గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చేది అప్పుడేనా..
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్(Ram Charan), భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer).

The release date of Game Changer will be clarified only then..
గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్(Ram Charan), భారీ సినిమాల డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ జరగండి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాగా.. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ మూవీ గత మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటూనే వస్తుంది. పలు కారణాలు వల్ల చిత్రీకరణ లేట్ అవ్వడంతో.. రిలీజ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. కాగా.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘గేమ్ ఛేంజర్’ సినిమా అనౌన్స్ అయిన రోజున చరణ్ అభిమానులు ఎంతగానో ఆనందించారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా చేయడం. పైగా అదీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత అవడం కూడా వారి అంచనాలను పెంచేసింది. యాక్షన్ తో కూడిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ వినిపించడంతో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. అయితే ఆగిపోయిన ‘ఇండియన్ 2’ (Indian 2) షూటింగ్ మళ్లీ మొదలుపెట్టిన దగ్గర నుంచి ‘గేమ్ ఛేంజర్’ సినిమా పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఒక దశలో ఈ ఫిల్మ్ అసలు విడుదల అవుతుందా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
మరోవైపు శంకర్ కమల్ హాసన్ తో భారీ మూవీ భారతీయుడు 2 కూడా తీస్తుండడంతో ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్‌పై పడింది. అయితే ఇండియన్ -2 మూవీని జూన్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే పక్కాగా భారతీయుడు 2 రిలీజ్ డేట్ ఖరారైన తరువాతనే ఈ మూవీ రిలీజ్ పై టీమ్ నుండి క్లారిటీ రానుందని, అప్పటి వరకు చరణ్ ఫ్యాన్స్ ఆగాల్సిందే అని అంటున్నాయి సినీ వర్గాలు.. కాగా.. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు బడా సినిమాలు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసుకొని ఉన్నాయి. వీటి మధ్యలో గేమ్ ఛేంజర్ ఎప్పుడు వస్తుంది..? అసలు ఈ ఏడాది వస్తుందా లేదా..? అనే టెన్షన్ ఫ్యాన్స్ కి పట్టుకుంది. మరి.. ఈ డౌట్స్‌కి ఆన్సర్ తెలియాలంటే మూవీ టీమ్ స్పందించాల్సిందే..