రూమర్ల రోగం పోదా… దేవర2 దాడి కన్ఫామ్…

త్రిబుల్ ఆర్, దేవర తో పాన్ ఇండియాని రెండు సార్లు షేక్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హ్యాట్రిక్ కి సిద్దమౌతున్నాడు. వార్ 2 తో 120 రోజుల తర్వాత పాన్ ఇండియాని షెక్ చేయబోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 08:30 PMLast Updated on: Apr 16, 2025 | 8:30 PM

The Rumor Mill Is Over Devara 2 Attack Confirmed

త్రిబుల్ ఆర్, దేవర తో పాన్ ఇండియాని రెండు సార్లు షేక్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హ్యాట్రిక్ కి సిద్దమౌతున్నాడు. వార్ 2 తో 120 రోజుల తర్వాత పాన్ ఇండియాని షెక్ చేయబోతున్నాడు. అయితే,గీతే ఈ సినిమా మీద యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ చేశారంటే అర్ధముంది. సోషల్ మీడియాలో కామెంట్లతో వాళ్ల కుళ్ళు బుద్ది బయట పెట్టారంటే అర్ధముంది. కాని అలా చేయట్లేదు. పనికట్టుకుని దేవర2 మీద బురద చల్లే వ్యవహరాం కనిపిస్తోంది. ముందు డ్రాగన్ పూర్తవ్వాలి, ఆతర్వాతే దేవర 2 మీద డిస్కర్షన్ జరగాలి… ఈరెండీంటికంటే ముందు ఆగస్ట్ 14 కి ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2 వస్తోంది.. అయినా వీటన్నీంటిని వదిలేసి, దేవర2 మీదే నెగెటీవిటీని ప్రచారం చేస్తున్నారు. కాబట్టే ఇది వాంటెడ్ లీ జరుగుతున్న ఆర్టీఫిషియల్ ఎటాక్ అని తెలుస్తోంది. దానికే కళ్యాణ్ రామ్ బ్రేక్ వేశాడు. బాంబు పేల్చాడు… అదేంటో, తన మాటలకర్ధం ఏంటో చూసేయండి.

దేవర2 మూవీ ఉంటుంది.. ఉంటుంది.. ఉండి తీరుతుంది.. ఇలా ఎన్టీఆర్ నుంచి డైరెక్టర్ కొరటాల శివ వరకు ఎవరు చెప్పినా రూమర్లు ఆగట్లేదు. ఇది లేదు, రాదు, వచ్చే అవకాశం లేదంటూ పుకార్లు పుట్టిస్తూ పండగ చేసుకుంటున్నారు, యాంటీ ఫ్యాన్స్.. వీళ్ళ బాధ దేవర ప్రొడ్యూసర్ కమ్ ఎన్టీఆర్ బ్రదర్ అయినా కళ్యాణ్ రామ్ కి అర్ధమైనట్టుంది.కుండబద్దలు కొట్టినట్టు దేవర 2 ఉంటుందనే కాదు, ఎప్పుడు మొదలౌతుందో కూడా తేల్చాడు. ఇంతకి యాంటీ ఫ్యాన్స్ ఏడుపుకి కారణం ఏంటంటే, 2 వేల కోట్ల వసూల్లు… బేసిగ్గా హిట్ మూవీ ఏదొచ్చినా దాని సీక్వెల్ కి కనీసం మూడు రెట్ల వసూళ్లు రావటం కామన్. బాహుబలి 2, కేజీయఫ్ 2, పుష్ప2 ఈ మూడు సినిమాలకు వచ్చిన వసూళ్లు చూస్తే, అన్నీ కూడా ఫస్ట్ పార్ట్ కంటే కనీసం 3 రెట్ల పైనే వసూళ్లు రాబట్టాయి.

కాబట్టి 670 కోట్లు రాబట్టిన దేవర కి సీక్వెల్ దేవర 2 వస్తే, 2000 కోట్ల నుంచి 2400 కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ఉంది. కేవలం ఫిల్మ్ టీం ఊహల్లోనే లెక్కలేసుకోవటం కాదు, రియాలిటీ కూడా ఇలానే ఉంది. బాహుబలి 550 కోట్లు రాబడితే, బాహుబలి 2 కి 1850 కోట్లొచ్చాయి. కేజీయఫ్ 450 కోట్లు రాబడితే, చాప్టర్ 2 1350 కోట్లు రాబట్టింది. ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ కి 400 కోట్లొస్తే, పుష్ప 2 కి 1800 కోట్లొచ్చాయి. ఎలాచూసుకున్నా, హిట్ మూవీకి సీక్వెల్ కూడా హిట్ అవటం కామన్. వసూల్లు కనీసం రెండుమూడు రెట్లుండటం కూడా కామనే. అంతగా బ్లాక్ బస్టర్ ముందే కన్ఫామ్ అయిన దేవర 2 ని ఎవరైనా అటకెక్కిస్తారా? ఛాన్సేలేదు.. అయినా అది ఆగిపోయిందనే రూమర్స్ వస్తున్నాయి. ఏకంగా 75 వేల ట్వీట్లు, ఇన్ స్టా కామెంట్లు రూపంలో రావటంతో, ఇది వాంటెడ్ లీ జరుగుతున్న సోషల్ మీడియా వార్ అని ఫిల్మ్ టీం కన్పామ్ చేసుకున్నట్టుంది.

అందుకే మొన్న ఎన్టీఆర్ మ్యాడ్ స్క్ర్వేర్ ఈవెంట్ లో దేవర 2 ఫస్ట్ పార్ట్ ని మించేలా ఉంటుందన్నారు. ఇప్పడుు కళ్యాణ్ రామ్ అయితే డ్రాగన్ అయిపోయిన వెంటనే దేవర2 మొదలౌతుందన్నాడు. అంతేకాదు సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ 2 తీస్తున్ననెల్సన్ దిలీప్ కుమార్ మూవీ కంటే ముందే దేవర2 ఉంటుందని తారక్ అన్న దేవర ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. పీఆర్, తో సోషల్ మీడియాలోని యాంటీ ఫ్యాన్స్ కి కౌంటర్ ఎటాక్ ఇస్తూనే ఉన్నాడు.