1000 కోట్ల పుష్ప అత్యాశ… ఫ్యాన్సే బానిసలా..? ప్రభాస్, ఎన్టీఆర్ అలాకాదా?

1000 కోట్ల వసూళ్ల మీద హీరోల ఆశలు ఆకాశాన్నంటుతున్నాయి. అది తప్పు కూడా కాదు. కాని పుష్ప2 మూవీ టిక్కెట్ ప్రైజ్ మీద కామెంట్లు, విమర్శలతో సీన్ రివర్స్ అవుతోంది. ఫ్యాన్స్ అంటే హీరోలకి బలిపశువుల్లా, మరీ బానిసల్లా కనిపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 05:25 PMLast Updated on: Dec 04, 2024 | 5:25 PM

The Scene Is Turning Upside Down With Comments And Criticism Over The Ticket Price Of The Movie Pushpa 2

1000 కోట్ల వసూళ్ల మీద హీరోల ఆశలు ఆకాశాన్నంటుతున్నాయి. అది తప్పు కూడా కాదు. కాని పుష్ప2 మూవీ టిక్కెట్ ప్రైజ్ మీద కామెంట్లు, విమర్శలతో సీన్ రివర్స్ అవుతోంది. ఫ్యాన్స్ అంటే హీరోలకి బలిపశువుల్లా, మరీ బానిసల్లా కనిపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. హీరో మీద అభిమానంతో తన భరువంతా వాళ్లు మోస్తుంటే, వాళ్లమోకాల్లే విరగ్గొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రతీ హీరో ఫ్యాన్స్ కి ఆల్ మోస్ట్ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. కాని అల్లు ఆర్మీకి మాత్రం బానిసల ట్యాగ్ పడుతోందా? తమ అభిమాన హీరో కోసం ఏమైనా పిలిపించుకుంటామనే బ్యాచ్ ని, నిజంగా హీరో నెగ్లెక్ట్ చేస్తున్నాడా? ఇంతకి ఏ మూవీ రిలీజైనా ఫ్యాన్స్ ని బానిసలనే మాట రాకున్నా, ఇప్పుడే ఎందుకు ఆ పదం రీసౌండ్ చేస్తోంది… ? ఈ చర్చ ఎందుకు భారీగా పెరిగింది?

పుష్ప2 మూవీ రిలీజ్ కి గంటలే టైం ఉంది.. ప్రివ్యూరూపంలో బుధవారం బాక్సాఫీస్ షేక్ కాబోతోంది. కాని విచిత్రం గా తన ఫ్యాన్సే షేక్ అవ్వాల్సి వస్తోంది. ఎందుకంటే ప్రివ్యూకి మల్టీ ప్లెక్స్ లో అయితే టిక్కెట్ 1250, సింగిల్ స్క్రీన్ లో అయితే వెయ్యిరూపాయలు.. ఇక హైద్రబాద్, ముంబైలోని కొన్ని థియేటర్స్ లో 3 వేల వరకు టిక్కెట్ ప్రైజుంటే, యూఎస్లో ఏకంగా 15వేలకు టిక్కెట్ సేల్ అవుతోంది

ఇదంగా పుష్ప మీదున్న క్రేజ్ వల్లే పార్ట్ 2 కి వస్తున్న రియాక్షన్ అని ఫిల్మ్ టీం అనుకున్నా, మరో టాక్ మాత్రం షాక్ ఇస్తోంది. అల్లు అర్జునికి తన ఆర్మీ అంటే పిచ్చని ఎన్ని సార్లు చెప్పినా, చివరికి తన అభిమానులనే పిచ్చోళ్లని చేస్తున్నాడా అన్న కొత్త డిస్కర్షన్ మొదలైంది

ఎందుకంటే పుష్ప2 ప్రివ్యూకి టిక్కెట్ రేటు ఎంత ఘాటెక్కినా చూసేందుకు సిద్దపడేది మామూలుగా అయితే అభిమానులే… ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ అబిమాన హీరోని మరో మెట్టు పైనే ఉండాలని కోరుకునే ఫ్యాన్స్, ఆమెట్ల కింద నలిగిపోతున్నారా? ఈ డౌట్ రావటానికి పుష్ప2 ప్రివ్యూ టిక్కెట్ల ప్రైజే కారణం

సలార్, కల్కీ, దేవర ఇలా ఆల్ మోస్ట్ పాన్ ఇండియా సినిమాలేవైనా, పెద్ద హీరోల మూవీలేవొచ్చని, టిక్కెట్ రేట్లు భారీగా పెరగటం కామన్. కాని పుష్ప2 ప్రివ్యూ కి టిక్కెట్ రేటు చాలా ఎబ్ నార్మల్ గా ఉందంటున్నారు. అల్లు ఆర్మీ అంటే తనకు పిచ్చి అని బన్నీ అంటూనే తన అభిమానులనే పిచ్చెక్కిస్తున్నాడా?

ఐనా టిక్కెట్ రేటు, దాని పోటు హీరో చేతిలో ఉండదు.. కాని తన అభిమానులకు పడే టిక్కెట్ పోటు మాత్రం పడిపోతోంది. ఎంత గొప్ప సినిమా రిలీజ్ కి రెడీ అయినా, కామన్ ఆడియన్స్ కంటే, 90 శాతం అభిమానులే ముందుగా చూసేందుకు క్యూకడటారు. కాని వాల్లనే బానిసల్లా స్టార్ హీరోలు మార్చేస్తున్నారా అన్న డిస్కర్షన్ పెరిగింది. కటౌట్లు కట్టీ, పాలాభిషేకాలు చేసి మురిసిపోయే వాళ్లకి ఫ్రీ టిక్కెట్లు ఇవ్వకపోయినా పర్లేదు, టిక్కెట్ రేటు తగ్గించకున్నా పర్లేదు.. కాని ఫ్యాన్స్ కూడా టిక్కెట్ కొనాలంటే కంగారు పడేంత గా ప్రివ్యూ టిక్కెట్ రేట్లు ఉండటం షాకింగ్ గా ఉంది.