Pawan.. ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ ఐదు రోజులే
గబ్బర్ సింగ్’ (Gabbar Singh) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , హరీష్ శంకర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh).. 12 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ కావడంతో ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. పైగా.. ‘ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది’ అంటూ.. అదిరిపోయే గ్లింప్స్ తో పవన్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ వైబ్స్ ని ఇచ్చాడు హరీశ్..

The shoot of Ustad Bhagat Singh was only five days
‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , హరీష్ శంకర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh).. 12 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ కావడంతో ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. పైగా.. ‘ఈసారి పర్ఫామెన్స్ బద్దలైపోద్ది’ అంటూ.. అదిరిపోయే గ్లింప్స్ తో పవన్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ వైబ్స్ ని ఇచ్చాడు హరీశ్.. దీంతో.. ఈ మూవీ ఎంత శాతం షూట్ కంప్లీట్ పూర్తి చేసుకుంది.? ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ తెగ ఆరాలు తీస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో మూవీ షూటింగ్‌పై హరీశ్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ చేసింది కేవలం ఐదు రోజులేనని కట్ చేసిన టీజర్ కూడా ఆ 5 రోజుల షూటింగ్ కు సంబంధించినదే అంటూ హరీశ్ శంకర్ లేటెస్ట్ అప్‌డేట్ చ్చాడు. ఐదు రోజుల్లో ఎంత షూట్ చేశామంటే 15 రోజుల్లో ఎంత షూట్ చేస్తామో అంత చేశామంటూ ఫ్యాన్స్‌కు షాకిచ్చాడు. అయితే.. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సెట్స్ లో ఎలా అయితే పవన్ కనిపించాడో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన జోష్ మరియు స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు అంటూ హరీశ్ చేసిన కామెంట్లు మాత్రం ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
దీంతో.. ఈ సినిమాని నిజంగానే పక్కన పెట్టేశారా అనే డౌట్స్ వినిపించాయి. అయితే మూవీని పక్కన పెట్టలేదని, బ్రేక్ మాత్రమే ఇచ్చారని.. హరీష్ శంకర్ లేటెస్ట్ కామెంట్ల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా సాక్షి వైద్య కూడా ఎంపిక అయ్యినట్లు సమాచారం. ఇక గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. గబ్బర్ సింగ్‌లో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన డీఎస్పీ ఈ మూవీలో కూడా ఇరగదీస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.