తెలుగోళ్ళ అరవపిచ్చి.. తమిలోళ్ళు కూడా తగ్గట్లేదుగా…?
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత డైరెక్టర్లకు హీరోలకు బౌండరీలు అయితే కనపడటం లేదు. ఎక్కడైనా.. ఏ భాషలో అయినా ఎప్పుడైనా సినిమా చేసేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతున్నారు.

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత డైరెక్టర్లకు హీరోలకు బౌండరీలు అయితే కనపడటం లేదు. ఎక్కడైనా.. ఏ భాషలో అయినా ఎప్పుడైనా సినిమా చేసేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతున్నారు. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో ఇది ఎక్కువగా కనబడుతోంది. బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మన సౌత్ ఇండియా పై ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నారు. ముఖ్యంగా తమిళ డైరెక్టర్ల విషయంలో ఇండియా వైడ్ గా క్రేజ్ కనబడుతోంది. వాళ్ళు చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో దుమ్మురేపుతున్నాయి.
దీనితో ఇప్పుడు ఆ డైరెక్టర్లపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టార్ హీరోలు. ముఖ్యంగా మన తెలుగులో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్లు తమిళ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇండియా వైడ్ గా ఫేమస్ అయింది. ఇప్పటికే ఈ యూనివర్స్ లో మూడు సినిమాలు వచ్చాయి. ఇక త్వరలోనే ప్రభాస్ కూడా ఇందులో భాగమయ్యే ఛాన్స్ ఉంది అనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ప్రభాస్ కు లోకేష్ కథ వినిపించాడు. ఆ కథ కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. హోం బలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించడానికి కూడా రెడీ అయిపోయింది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కూడా తమిళ మార్కెట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అక్కడి స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఎన్టీఆర్ కూడా దీనిపై కామెంట్స్ చేసాడు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ కథ ఫైనల్ అయిపోయింది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమా 2028 లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇక పుష్ప సినిమాతో మంచి స్వింగ్ లో ఉన్న అల్లు అర్జున్ కూడా తమిళ డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లెవెల్ లో హిట్ కొట్టిన అట్లీతో ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ కథ రెడీ అయిపోయింది.
అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా రెడీగా ఉండటంతో.. ఆ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. త్వరలోనే దీనిపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హీరో నాని కూడా తమిళ మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. తమిళనాడు డైరెక్టర్ శిబి చక్రవర్తితో ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హిట్ 3 తో పాటుగా మరో సినిమాతో కూడా బిజీగా ఉండడంతో ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇలా మన స్టార్ హీరోలు అందరూ తమిళనాడు మార్కెట్ పై ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నారు. అటు రామ్ చరణ్ కూడా జైలర్ డైరెక్టర్.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వచ్చినా దానిపై మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు.