Allu arjun Ramcharan : అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్
కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

The situation has been like Mega vs Allu for a few days now.
కొద్దిరోజులుగా మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఎన్నికల్లో టీడీపీ (TDP), జనసేన (Jana Sena), బీజేపీ కూటమి (BJP Alliance) విజయం సాధించిన తర్వాత.. మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ బాగా టార్గెట్ అయ్యాడు. బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ బాక్సాఫీస్ వార్ కి దిగనున్నారనే వార్త సంచలనంగా మారింది.
ఆగస్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే తేదీపై రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ కన్నేసింది. ఈ చిత్రాన్ని కూడా క్రిస్మస్ కి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఉన్నారు. పైగా ‘పుష్ప’తో బన్నీ, ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. దానికితోడు ‘పుష్ప’కి సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప 2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక చరణ్ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ‘గేమ్ ఛేంజర్’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే.. ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ క్లాషెస్ లో ఒకటి అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తెలుగునాట పెద్ద సంచలనమే అవుతుంది. మరి నిజంగానే అల్లు అర్జున్, రామ్ చరణ్ బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నారా లేదా అనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.