మెక్సికో డ్రగ్స్ వాసన.. స్పిరిట్ లో 2000 కోట్ల డ్రగ్ కలిసేదక్కడే…!
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్లాన్ చేసినప్పటి నుంచి, షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న మళ్లీ నీ ఇంజూరి వల్లే ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ వాయిదా పడింది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ప్లాన్ చేసినప్పటి నుంచి, షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న మళ్లీ నీ ఇంజూరి వల్లే ది రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ వాయిదా పడింది. ఫౌజీకి బ్రేక్ పడింది. వీటి ఎఫెక్ట్ కూడా స్పిరిట్ మీద పడి, షెడ్యూల్ వాయిదా పడింది. అయినా ఈ గ్యాప్ లో మెక్సికోలో పని స్టార్ట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 వేల కోట్ల డ్రగ్స్ కి స్పిరిట్ లో కలిపేస్తున్నాడు. మెక్సికో వాసన మూవీలో నింపేందుకే 2 వేల కోట్ల డ్రగ్ ని టార్గెట్ చేశాడు. తను పోలీస్ కాదు, మెక్సికో ఇండియా కాదు, కాబట్టి అక్కడికి వెళ్లి మనోళ్లుచేసేదేం ఉండదు.. కాని సందీప్ రెడ్డి వంగ మెక్సికోకి చుట్టం చూపులా వెళ్లి, అక్కడి లొకేషన్లకు చుట్టంగా మారిపోయాడు.అలాని తను సినిమాలో నిజమైన డ్రగ్ ని వాడట్లేదు… కాని డ్రగ్స్ ని మించిన మత్తుకి, 2 వేల కోట్ల లెక్క కడుతున్నాడు. ఇదేదో పెద్ద సెన్సేషనే అయ్యేలా ఉంది. అదేంటో చూసేయండి.
సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ కోసం మెక్సికో వెళ్లొచ్చాన్నాడు. మళ్లీ వెళుతున్నాడు. ముందు ఇది కేవలం మెక్సికోలో కొన్ని లొకేషన్స్ కోసం చేసే రెక్కి అన్నారు. కాని సీన్ చూస్తే మ్యాటర్ అక్కడితోనే ఆగలేదు. 150 మంది మెక్సికన్ లకు ఆడిషన్ చేసి వచ్చిన సందీప్ రెడ్డి పాన్ ఆసియా ప్రాజెక్టుని పాన్ వరల్డ్ గా మార్చే ప్రయత్నమేదో చేస్తున్నట్టు తెలుస్తోంది.అసలే రెబల్ స్టార్ ప్రభాస్ మొన్నటి గాయం తిరగ తోడిందని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మళ్లీ ది రాజా సాబ్, ఫౌజీ షూటింగ్ షెడ్యూల్స్ మారిపోతాయనే టెన్షన్ ఫిల్మ్ టీం లో ఉంది. కాని ఇలాంటి టైంలో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. మెక్సికో మ్యాటర్ రివీల్ చేశాడు. అది కూడా అఫీషియల్ గా.. ఇక మీడియాకిచ్చిన ఆఫ్ ద రికార్డ్ మ్యాటర్ మాత్రం మతపోగొట్టేలా ఉంది.
ప్రభాస్ ని పోలీస్ పాత్రలో చూడాలని ఫ్యాన్స్, అను అలా వస్తే పాన్ ఇండియా కాదు పాన్ ఆసియా మార్కెట్ షేక్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ ముందే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు. ఆల్రెడీ కొరియా హీరోని ఇందులో విలన్ గా తీసుకోవటం కన్ఫామ్ అయ్యింది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా ప్రభాస్ కి అన్నగా నటించేందుకు డేట్లిచ్చినట్టు తెలుస్తోంది.
ఇలాంటి టైంలో స్పిరిట్ కి మెక్సికో కనెక్షన్స్ మతిపోగొట్టేలా ఉన్నాయి. ప్రపంచంలోనే డ్రిగ్స్ డాన్స్ అనుకున్న వాళ్లలో ఎక్కువ మంది మెక్సికన్స్ అనే అభిప్రాయముంది. అమెరికన్ మూవీస్, వెబ్ సీరీస్ లే కాదు, బయోపిక్స్ లోకూడా మెక్సికో కి ఓ కనెక్షన్ ఉంది.సో మెక్సికన్ డ్రగ్ మాఫియాకు, కొరియన్, జపనీస్ నటులకు, స్పిరిట్ మూవీతో కనెక్షన్ పెడుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. బేసిగ్గా ప్రభాస్ సినిమా అంటేనే 1000 కోట్లు కామన్ అనుకునే పరిస్థితి. అలాంటి తనతో సందీప్ రెడ్డి వంగ సినిమా తీస్తే, 2వేలకోట్లకు వసూళ్ళు తగ్గే ఛాన్సే ఉండదు. దానికి మెక్సికో డ్రగ్ మాఫియా కాన్సెస్ పడటం, ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతుండటం, ఇవన్నీ నిదానంగా సందీప్ బయటికి రివీల్ చేస్తుండటంతో, అంచానాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఇంత ఎగ్జైటింగ్ కంటెంట్ రెడీగా ఉంది కాబట్టే, ది రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ ఎప్పుడైపోతే, ఎప్పుడు స్పిరిట్ ని షురూ చేయాలా అన్నంతా ఈగర్ గా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇది ఆఫ్ ద రికార్డ్ లో మీడియాకిచ్చిన ఇన్ ఫర్ మేషన్ తో ఇండస్ట్రీలో మొదలైన సెన్సేషన్.